Elon Musk : పంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం కోసం మస్క్ అభ్యర్థిత్వానికి సంబంధించిన పిటిషన్ నోబెల్ కమిటీకి చేరింది. ఈ విషయాన్ని యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ధ్రువీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్‌ను సమర్పించినట్లు వెల్లడించారు.
జనవరి 29వ తేదీన ఆ అభ్యర్థిత్వాన్ని సమర్పించినట్లు కూడా బ్రాంక్ గ్రిమ్స్ స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అయితే గతేడాది కూడా మస్క్ పేరు నోబెల్ శాంతి బహుమతి 2024 రేసులో వినిపించింది. అప్పుడు నార్వేకు చెందిన పార్లమెంట్ సభ్యుడు మారియస్ నీల్సన్.. గతేడాది ఫిబ్రవరి నెలలో మస్క్ పేరును ప్రతిపాదించారు. కానీ అప్పుడు ప్రపంచ కుబేరుడికి ఆ బహుమతి అందలేదు.
నోబెల్ శాంతి బహుమతికి ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా గుర్తింపు ఉంది. ప్రతీ సంవత్సరం ఆరు విభాగాల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనమిక్స్, లిటరేచర్, శాంతి) నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. అయితే ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ప్రతీ ఏడాది అక్టోబర్ నెల మధ్యలో ఈ బహుమతి కోసం అభ్యర్థుల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరి 31వ తేదీకి గడువు ముగుస్తుంది. కాగా, ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్‌ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఈ బహుమతిని అందజేస్తారు.
Read Also: Ola S1 Gen 3: ఓలా నుంచి సరికొత్త బైక్.. రేపే లాంచ్!