5000 Dollars Gift : అమెరికా ప్రభుత్వ ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’ (డోజ్) విభాగం సారథి, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు జనాలకు షాక్ ఇచ్చాయి. ఎంతోమంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డుపాలు చేసే నిర్ణయాలు ఎలాన్ మస్క్ వల్లే అమలయ్యాయి. వేలాది మంది గవర్నమెంటు ఉద్యోగులు అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. త్వరలో ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అదేమిటో చూద్దాం..
Also Read :Faecal Bacteria: మహాకుంభ మేళా.. గంగానదిలో బ్యాక్టీరియా అలజడి
‘డోజ్’ డివిడెండ్
- ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న ‘డోజ్’(5000 Dollars Gift) విభాగం అమెరికాలోని లక్షలాది పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వినిపించబోతోంది.
- అమెరికా ప్రభుత్వం ఖర్చులను తగ్గించడం ద్వారా డోజ్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా డబ్బులను ఆదా చేయబోతోంది.
- అమెరికా ప్రభుత్వం వార్షిక ఖర్చులు 6.5 ట్రిలియన్ డాలర్లు. దీనిలో ఏటా 2 ట్రిలియన్ డాలర్లను మిగిల్చడమే డోజ్ సంస్థ లక్ష్యం.
- ల్లో 2 ట్రిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది.
- ఈవిధంగా ఆదా చేసే డబ్బులో కొంత భాగాన్ని, అమెరికాలోని పన్ను చెల్లింపుదారులకు ‘డోజ్ డెవిడెండ్’ పేరిట అందించాలని ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారట.
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం 2026 జులై 4న జరగనుంది.
- 2026 సంవత్సరం జులై తర్వాత 5,000 డాలర్లు (రూ.4.3లక్షలు) చొప్పున చెక్కుల రూపంలో అమెరికాలోని పన్ను చెల్లింపుదారులకు పంపాలని మస్క్ యోచిస్తున్నారు.
- అజోరియా సంస్థ సీఈవో జేమ్స్ ఫిష్‌బ్యాక్ ఈమేరకు ఎలాన్ మస్క్‌కు సిఫార్సు చేసినట్లు తెలిసింది.
- అమెరికా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఆదా కానున్న 2 ట్రిలియన్ డాలర్లలో 20 శాతం నగదును దేశంలోని 7.9 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు పంచాలని భావిస్తున్నట్లు సమాచారం.
- ఈ అంశంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అనుమతి పొందే ప్రయత్నాల్లో ఎలాన్ మస్క్ ఉన్నారట.
- ఫిబ్రవరి 17 (సోమవారం) నాటికి ‘డోజ్’ వెబ్‌సైట్ ప్రకారం.. ఆ విభాగం అమెరికా ప్రభుత్వ ఖర్చుల్లో 55 బిలియన్ డాలర్లను మిగిల్చింది. ఈ డబ్బులను మిగిల్చేందుకుగానూ మోసాలకు అడ్డుకట్ట, కాంట్రాక్టుల రద్దు, లీజ్ క్యాన్సిలేషన్లు, ఆస్తుల విక్రయాలు, నిధుల రద్దు వంటి చర్యలను అమలు చేసింది.