Site icon HashtagU Telugu

Elon Musk- Trump: ఎలాన్ మ‌స్క్‌- ట్రంప్ మ‌ధ్య మాట‌ల యుద్ధం.. ఇంట్రెస్ట్ లేద‌న్న అమెరికా అధ్య‌క్షుడు!

Elon Musk- Trump

Elon Musk- Trump

Elon Musk- Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk- Trump) మధ్య వివాదం తీవ్రమైన తర్వాత ఇప్పుడు మాటల యుద్ధం కూడా ఉధృతమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇద్దరూ ఒకరినొకరు బాగా పొగడ్తలు కురిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ బహిరంగంగా ఒకరిపై ఒకరు తలపడుతున్నారు. శుక్రవారం (జూన్ 6, 2025) నాడు ట్రంప్.. ఎలన్ మస్క్ తనతో మాట్లాడాలనుకుంటున్నాడని, కానీ తాను మాట్లాడేందుకు సిద్ధంగా లేనని తెలిపారు.
ఎలన్ మస్క్ మనసు చెడిపోయింది- ట్రంప్

ఏబీసీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్, ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతూ.. అతని మనసు చెడిపోయిందని అన్నారు. ఈ వివాదాన్ని సమసిప్తం చేసేందుకు వైట్ హౌస్ అధికారులు ట్రంప్, మస్క్ మధ్య జూన్ 6న సమావేశం ఏర్పాటు చేసినట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఈ సమావేశ షెడ్యూల్ గురించి ట్రంప్‌ను ప్రశ్నించినప్పుడు అతను ఎలన్ మస్క్‌ను కలవడానికి నిరాకరించారు.

Also Read: KL Rahul: టీమిండియా టెస్టు క్రికెట్ ఓపెన‌ర్‌గా స్టార్ ప్లేయ‌ర్‌?

ట్రంప్, మస్క్ బహిరంగంగా తలపడ్డారు

శుక్ర‌వారం (జూన్ 6, 2025) నాడు ట్రంప్ తాను ఎలాన్ మస్క్‌కు ఎంతో సహాయం చేశానని, కానీ ఇప్పుడు మస్క్‌తో చాలా నిరాశకు గురైనట్లు చెప్పారు. మస్క్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) టాక్స్ ఇన్సెంటివ్‌లను తొలగించడంతో కలత చెందాడని ట్రంప్ ఆరోపించారు. దీనికి సమాధానంగా మస్క్.. ఈ బిల్ గురించి తనకు ఒక్కసారి కూడా చెప్పలేదని, అది అర్ధరాత్రి పాస్ అయ్యిందని పేర్కొన్నాడు. తన వల్లనే ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడని, తాను లేకుంటే ట్రంప్ ఓటమి ఖాయమని మస్క్ వరకు చెప్పాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను ఎలక్ట్రిక్ వెహికల్‌కు సంబంధిత చట్టపరమైన ఆదేశాన్ని ఉపసంహరించినప్పుడు మస్క్ కలవరపడ్డాడని చెప్పారు. ట్రంప్, మస్క్ కంపెనీకి ఇచ్చే సబ్సిడీలను రద్దు చేస్తానని బెదిరించారు. దీనితో ఎలన్ మస్క్ కూడా బహిరంగంగా రంగంలోకి దిగాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అంతరిక్ష యాత్రికులను, ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఉపయోగించే అంతరిక్ష క్యాప్సూల్ సేవలను నిలిపివేస్తానని మస్క్ బెదిరించాడు.