Site icon HashtagU Telugu

Israel-Hamas War: గాజా ఆసుపత్రులకు ఎలోన్ మస్క్ విరాళం

Israel-Hamas War

Israel-Hamas War

Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సామాన్యుల బతుకు జీవిత చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అక్టోబరు 7న గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడిలో వందలాది మంది చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడుతోంది. ఇలా రెండు వైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడిని తీవ్రతరం చేసింది, దాదాపు అన్ని టెలికమ్యూనికేషన్ సేవలను నిలిపివేసింది మరియు గాజాను ప్రపంచం నుండి వేరు చేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి ప్రతిరోజూ వేలాది మంది అమాయక పాలస్తీనియన్లు చనిపోతున్నారు. వీరిలో 60 శాతం మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు నష్టపోతున్నారని, ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు గాజాలోని అల్ షిబా ఆసుపత్రిలో హమాస్ సైనికులు తలదాచుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణుల దాడి చేసింది.ఈ పరిస్థితిలో ఎక్స్ (ట్విట్టర్) చైర్మన్ ఎలోన్ మస్క్, బాధిత ఇజ్రాయెల్ మరియు గాజా ఆసుపత్రికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Israel Hamas War: కాల్పుల విరమణ: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం