Site icon HashtagU Telugu

Twitter : ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్…సీఈవో కు ఉద్వాసన..!!

elon musk

elon musk twitter

ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మొత్తానికి పూర్తయ్యింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. 44కోట్ల డాటర్లతో ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు మస్క్. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సీఎఫ్ ఓ తోపాటు పలు విభాగాలకు చెందిన అధిపతలుకు ఉద్వాసన పలికారు.

కాగా ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఏదొక నిర్ణయం తీసుకోవాలంటూ అక్టోబర్ 28 తుదిగడువుగా కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రక్రియను పూర్తి చేసే చర్యలను వేగవంతం చేశారు మస్క్. 13 బిలియన్ డాలర్ల రుణాలకోసం ఈ మధ్యే బ్యాంకర్లతోసమావేశం అయ్యారు. తాజాగా ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మస్క్ అక్కడ చర్యలు జరిపారు. ట్విట్టర్ కార్యాలయంలో అడుగుపెడుతున్న ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ ను చీప్ ట్విట్ గా మార్చుకున్నారు. తన లొకేషన్ పై కూడా ట్విటర్ ప్రధానంగా కార్యాలయంగా మార్చుకున్నారు మస్క్.

ఇదంతా ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఒక రోజు ముందు జరిగింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను వెల్లడించింది.

Exit mobile version