Musk-Vivek Ramaswamy : భారత అభ్యర్థికి మస్క్ సపోర్ట్.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో కీలక మలుపు

Musk-Vivek Ramaswamy : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేత  వివేక్ రామస్వామిని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసించారు.

Published By: HashtagU Telugu Desk
Musk Vivek Ramaswamy

Musk Vivek Ramaswamy

Musk-Vivek Ramaswamy : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేత  వివేక్ రామస్వామిని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసించారు. “వివేక్ రామస్వామి నమ్మకమైన అభ్యర్థి” అని ప్రశంసల వర్షం కురిపించారు. ఓ మీడియా సంస్థకు వివేక్ ఇచ్చిన ఇంటర్వ్యూను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఎలాన్ మస్క్ ఈ కామెంట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వివేక్ రామస్వామి దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏదో  ఒక కార్యక్రమం చేస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు.

Also read : Flight: గాల్లో ఉండగానే విమానం ఇంజన్ ఫెయిల్.. క్షణాల్లోనే మంటలు.. చివరికి?

ఇటీవల “టక్కర్ కార్ల్సన్” షోలో వివేక్ పాల్గొన్నారు. ఎలాన్ మస్క్ వంటి బడా వ్యాపారవేత్తల చైనా పర్యటనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..  వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానన్నారు. చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని అభివర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందించిన ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి వయసులో అందరి కంటే చిన్నవారు. ఆయనతో పాటు నిక్కీ హేలీ, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు.

Also read : Pakistan: ఇదేందయ్యా ఇది.. భర్త తీవ్రవాది.. భార్య పాక్ కేంద్ర మంత్రి?

  Last Updated: 18 Aug 2023, 04:51 PM IST