Bilawal Bhutto: సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయడంతో పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అక్కడి సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల దాకా అందరూ భారత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జమ్మూకశ్మీరులోని పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే విషయాన్ని మర్చిపోయి వారు మాట్లాడుతున్నారు. ఏకంగా భారత్‌కే నీతులు చెబుతున్నారు. తాజాగా ఈ లిస్టులో పీపీపీ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీ కూడా చేరారు.
Also Read :Butta Renuka: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం.. ఎందుకు ?
భారత్‌తో పాక్ ఉద్రిక్తతలను పెంచేలా..
‘‘పాకిస్తాన్ వైపుగా సింధూ నదీలో(Bilawal Bhutto) నీరు ప్రవహించకపోతే.. పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుంది’’ అంటూ బిలావాట్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ నాగరికత పరిరక్షకులం తామే అంటూ అతడు భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. సింధూ నది ఎప్పటికీ పాకిస్తాన్‌దే అంటూ బుకాయించాడు. పాకిస్తాన్ కానీ, అంతర్జాతీయ సమాజం కానీ భారత్ యుద్ధ కాంక్షను అస్సలు సహించదని బిలావల్ అన్నాడు. ‘‘వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు మేమే వారసులమని మోడీ చెప్పుకుంటున్నారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులం మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం’’ అని ఓ ర్యాలీ వేదికగా బిలావల్ వ్యాఖ్యానించారు. భారత్‌తో పాకిస్తాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా బాధ్యతారాహిత్యంగా బిలావల్ కామెంట్స్ చేశారు. అంతకుముందు పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Also Read :Kanchi Kamakoti Peetam : కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగుతేజం గణేశశర్మ.. నేపథ్యమిదీ
పాక్‌లో వ్యవసాయ రంగానికి గడ్డుకాలమే
సింధూ, దాని ఉపనదుల జలాల పంపిణీ కోసం 1960లో భారత్, పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పున ఉన్న బియాస్, రావీ, సట్లజ్ నదుల్లోని నీళ్లపై హక్కులు భారత్‌కు.. సింధూ నది, ఛెనాబ్, ఝెలమ్ నదుల నీళ్లు పాక్‌కు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతో ఈ ఒప్పందం అమలును భారత్ నిలుపుదల చేసింది. సింధూ నది నీటిని భారత్ దిగువన ఉన్న పాక్‌కు విడుదల చేయకపోతే దాయాది దేశానికి షాక్ తప్పదు. అక్కడ వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది.