Gaza Border : నీరు లేక.. ఆహారం లేక అల్లాడుతున్న 23 లక్షల మంది గాజావాసులకు ఊరట కలిగించే వార్త ఇది. 14రోజులుగా నిత్యావసరాలు, తాగునీరు లేక అలమటించిన గాజావాసులకు నిత్యాసరాలు సరఫరా అయ్యే రోడ్డును తాత్కాలికంగా తెరిచేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతి ఇచ్చింది. ఈజిప్టు దేశంలోని రఫా ప్రాంతం నుంచి గాజాలోకి బార్డర్ ఓపెన్ అవుతుంది. అయితే ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఆ బార్డర్ ను ఈజిప్టు ఇన్నాళ్లూ తెరవలేదు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం తెరవడంతో ట్రక్కుల్లో నిత్యావసరాల సప్లై ప్రారంభమైంది. అయితే ఈజిప్టు నుంచి గాజాను కనెక్ట్ చేసే రోడ్డుపైనా ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంతో అది చాలా ధ్వంసమైంది. దీంతో వాహనాల రాకపోకలు పెద్ద సవాల్ గా మారాయి. వాటికి రిపేరింగ్ పూర్తయ్యాకే.. గాజాకు సరుకుల ట్రక్కులు వేగంగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. వివిధ దేశాలు, మానవతా సంస్థలు గాజాకు అండగా నిలిచేందుకు దాదాపు 210 ట్రక్కులలో 3 వేల టన్నుల సహాయ సామగ్రిని పంపారు. రఫా బార్డర్ పాయింట్ వద్ద గత పదిరోజులుగా రోడ్డుపైనే వెయిటింగ్ లో(Gaza Border) ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
మానవతా సాయం కోసం ఎదురుచూపులు
గాజాలో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. గాజాకు ఆహారం, నీటి సరఫరాలను కూడా ఇజ్రాయెల్ ఆర్మీ గత రెండువారాలుగా అడ్డుకుంటోంది. దీంతో గాజాలోని పౌరులు ఒంటిపూట భోజనం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో మురికినీటినే తాగుతున్నారు. కరెంటు లేకపోవటంతో ఆసుపత్రుల్లో మొబైల్‌ఫోన్ల వెలుగులో డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పైకి యెమన్‌లోని ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదార్లు కూడా మిస్సైల్ ఎటాక్స్ ప్రారంభించారు. వాటిని సముద్రంలోని అమెరికా యుద్ధ వాహక నౌక అడ్డుకొని ధ్వంసం చేస్తోంది. లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ కూడా ఇజ్రాయెల్ బార్డర్ లోని ఆర్మీ పోస్టులపై దాడుల చేస్తోంది.