Site icon HashtagU Telugu

Turkey : మృత్యుంజయురాలు.. ట‌ర్కీలో శిథిలాల నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆరేళ్ల బాలిక‌

Turkey Imresizer

Turkey Imresizer

టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం దాటికి దాదాపుగా 19 వేల మంది మ‌ర‌ణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కఠినమైన చలి వాతావరణం ఉండ‌టంతో మరింత మంది ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవ‌ని అధికారులు అంటున్నారు. టర్కీలో మూడు రోజులకు పైగా శిథిలాల లోపల చిక్కుకుపోయిన 6 ఏళ్ల బాలికను ఆర్మీ సిబ్బంది గురువారం బయటకు తీశారు. నస్రీన్ అనే బాలికను రెస్క్యూ టీమ్ కాపాడింది. బాలిక ఎడమ పాదం మీద నుజ్జునుజ్జు గాయాలు ఉన్నాయని. బాలిక ఆరోగ్యం ఇప్పుడు నిల‌క‌డ‌గా ఉంద‌ని ఆర్మీ క్యాంప్‌లోని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌లో బాలిక నస్రీన్ తల్లి కూడా రక్షించబడింది.. కానీ దురదృష్టవశాత్తు ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు ఇప్పటికీ ఆచూకీ లేదు. ఆమె కుటుంబంలో ఐదుగురు సభ్యులు శిథిలాల కింద ఉన్నారు. నస్రీన్, ఆమె తల్లిని ఆర్మీ సిబ్బంది ర‌క్షించారు. మిగిలిన ముగ్గురు కోసం రెస్య్కూ టీమ్ గాలిస్తుంది. మూడు రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్న బాలిక నస్రీన్ నిజంగా మృంత్యుజ‌యురాలే.