Site icon HashtagU Telugu

Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. జనం వణుకు

Earthquake

Earthquake

Earthquake : ఇండోనేషియాలోని సౌలంకి సిటీలో ఇవాళ ఉదయం 10.23 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ఎఫెక్ట్ సౌలంకి సిటీ పరిసర ప్రాంతాల్లో కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మంది చనిపోయారు ? ఎంత మంది గాయపడ్డారు ? అనే వివరాలు తెలియరాలేదు.దేశంలోని బండా సముద్రంలో భూప్రకంపనలను గుర్తించామని ఇండోనేషియా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఇండోనేషియాలోని అంబాన్‌ ప్రాంతానికి ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల దూరాన 146 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఈనేపథ్యంలో సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇండోనేషియా సుప్రీంకోర్టులో.. 

ఇండోనేషియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ అన్వర్ ఉస్మాన్‌ను ఆ పదవి నుంచి తప్పిించారు. ఈమేరకు ఆ దేశానికి చెందిన న్యాయ నిపుణుల కమిటీ  నిర్ణయం తీసుకుంది. అన్వర్ ఉస్మాన్‌.. స్వయానా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు బావ అవుతారు. అధ్యక్షుడు జోకో విడోడో పెద్ద కుమారుడు గిబ్రాన్ రాకబుమింగ్ రాకా దేశ ఉపాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇస్తూ తీర్పు వినిపించిన రాజ్యాంగ  ధర్మాసనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ అన్వర్ ఉస్మాన్‌ సారథ్యం వహించారు. దీనిపై ఇండోనేషియా సుప్రీంకోర్టు న్యాయ విచారణ ప్యానెల్ సమీక్ష చేసి.. ఈ తీర్పును ఆయన బంధుప్రీతితో ఇచ్చారని తేల్చింది. దీంతో ఆయనను సీజేఐ పదవి నుంచి తప్పించింది. ఇకపై ఆయన సాధారణ జడ్జిగా కొనసాగొచ్చని తెెలిపింది. రిటైరయ్యే వరకు మళ్లీ చీఫ్ జస్టిస్ కాలేరని న్యాయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 2024 ఫిబ్రవరిలో ఇండోనేషియా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ పరిణామాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడోకు భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

Also Read: Soulmate Signs : మీ లవర్ ఆత్మీయుడా ? కాదా ? 6 సంకేతాలు

ఇండోనేషియాలోని బండా సముద్ర ప్రాంతంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది: EMSC