Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు

ఇండోనేషియాలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఇండోనేషియాలోని తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

  • Written By:
  • Updated On - January 10, 2023 / 07:27 AM IST

ఇండోనేషియాలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఇండోనేషియాలోని తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. EMSC ప్రకారం.. ఇండోనేషియాలోని తనింబర్ ప్రాంతంలో సంభవించిన భూకంపం భూమి ఉపరితలం నుంచి 97 కిలోమీటర్ల (60.27 మైళ్లు) లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అంతకుముందు.. డిసెంబర్ 2021లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

EMSC ప్రకారం.. ఇండోనేషియాలోని తువాల్ ప్రాంతానికి 342 ఆగ్నేయ దిశలో స్థానిక కాలమానం మధ్యాహ్నం 2:47 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అలాగే ఇండోనేషియాకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని యూరోపియన్ సిస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది. రాబోయే కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో మరో భూకంపం వచ్చే అవకాశం ఉందని EMSC హెచ్చరించింది. భూ ప్రకంపనల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

ఆస్ట్రేలియా, తైమూర్ లెస్టే,ఇండోనేషియాలో దాదాపు 14 మిలియన్ల మంది భూకంప ప్రకంపనలు అనుభవించారు. సీస్మిక్ డేటా ద్వారా భూకంపం సంభవించినట్లు నిర్ధారించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ట్వీట్ చేసింది. అయితే.. భూకంపం తర్వాత ఎటువంటి సునామీ ముప్పు లేదని EMSC పేర్కొంది. రాబోయే కొన్ని గంటలు లేదా రోజుల్లో మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అవసరమైతే తప్ప మీ భద్రత కోసం దెబ్బతిన్న ప్రాంతాల నుండి దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాతీయ అధికారుల సమాచారాన్ని అనుసరించండి అని EMSC ట్వీట్ చేసింది. అంతకుముందు నవంబర్‌లో ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 318 మంది మరణించారు. భూకంపం కారణంగా సియాంజూర్‌లో 62,545 మంది నిరాశ్రయులయ్యారని జిన్హువాను తెలిపింది.