China Earthquake : చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి

China Earthquake : చైనాలో  సోమవారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది. 

  • Written By:
  • Updated On - December 19, 2023 / 10:34 AM IST

China Earthquake : చైనాలో  సోమవారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.  గన్సు, క్వింఘై ప్రావిన్సులలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలలో 111 మందికిపైగా చనిపోయారు.  మరో 200 మందికిపైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. వాయవ్య చైనాలోని పర్వత ప్రాంతాలలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని చైనా ప్రభుత్వ మీడియా ఏజెన్సీ ‘జిన్హువా’  తెలిపింది. సోమవారం అర్ధరాత్రి టైంలో వచ్చిన ఈ భూకంపం కారణంగా గన్సు ప్రావిన్స్‌లో 100 మందికిపైగా, దాని పొరుగునే ఉన్న క్వింఘై ప్రావిన్స్‌‌లో మరో 11 మంది మరణించారని పేర్కొంది.  గన్సు ప్రావిన్స్‌లో 96 మంది, క్వింఘై ప్రావిన్స్‌‌లో 124 మంది గాయపడ్డారని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

క్వింఘై ప్రాంతీయ సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల (3 మైళ్ళు) దూరంలో ఉన్న గన్సు ప్రావిన్స్ పరిధిలోని జిషిషన్ కౌంటీలో కూడా భూకంపం(China Earthquake) సంభవించింది. అక్కడ భూకంప తీవ్రత 5.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. నీరు, విద్యుత్ లైన్లు, రవాణా, సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు చైనా టీవీ ఛానెల్ CCTV నివేదించింది. భూకంపంతో ప్రభావితమైన ప్రాంతాలకు టెంట్లు, ఫోల్డింగ్ బెడ్‌లు, క్విల్ట్‌లను పంపారని చెప్పింది. భూకంపం జరిగిన చోట సహాయక చర్యలను వేగవంతం చేయాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.

Also Read: JN.1 Covid Variant: కరోనా JN.1 కొత్త వేరియంట్ కలకలం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..!