Earthquake : లంక, లద్దాఖ్‌‌లలో భూప్రకంపనలు

Earthquake : ఇవాళ మధ్యాహ్నం 12.31 గంటలకు శ్రీలంక రాజధాని కొలంబోను భూకంపం వణికించింది.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 05:36 PM IST

Earthquake : ఇవాళ మధ్యాహ్నం 12.31 గంటలకు శ్రీలంక రాజధాని కొలంబోను భూకంపం వణికించింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల తీవ్రతకు కొన్నిచోట్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఆస్తి, ప్రాణనష్టం వివరాలేవీ తెలియరాలేదు. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2గా నమోదైంది. కొలంబోకు ఆగ్నేయ దిశగా 1326 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈవివరాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ది జియోలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో మరో రకమైన ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో సంభవించిన భూకంపం వల్ల తక్షణమే ముప్పు లేదని వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలోని 10 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు చెప్పింది.మరోవైపు భారత్‌లోని లద్దాఖ్‌లోనూ మధ్యాహ్నం 1.08 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. కార్గిల్‌కు వాయువ్య దిశలో 314 కిలోమీటర్ల దూరంలో 20 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని(Earthquake)  గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

  • గత రెండు రోజులలో దక్షిణ సూడాన్, ఉంగాడా, తజికిస్థాన్, తైమూర్, ఇండోనేషియా తదితర దేశాల్లో భూకంపాలు చోటుచేసుకున్నాయి.
  • సోమవారం దక్షిణ సూడాన్, ఉగాండాలలో 4.9 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది.
  • ఆదివారం రోజు తైమూర్‌, ఇండోనేషియాలలో 5.6 తీవత్రతో భూకంపం సంభవించింది.
  • నవంబరు 11న పాకిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
  • గతవారం నేపాల్‌ను శక్తివంతమైన భూకంపం కుదిపేయడంతో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావంతో ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Also Read: Leo: ఓటీటీలోకి లియో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!