Earthquake: తెల్లవారుజామున భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 09:36 AM IST

Earthquake : పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామునే ఉదయం 3.38 నిమిషాలకు పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్టు భూకంప జాతీయ కేంద్రం వెల్లడించింది. 4.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్టు తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 34.66 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 73.51 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ లో నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు ఏవైనా జరిగాయా అనేదానిపై ఇంకా వివరాలు రాలేదు.
అయితే.. పాకిస్థాన్ కంటే ముందే న్యూ గెనియాలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యూగెనియాలోని నార్త్ కోస్ట్ కు దగ్గర్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత పాకిస్థాన్ లో భూమి కంపించింది. ఉదయం 3.16కే న్యూగెనియాలో భూమి కంపించింది. అక్కడ కూడా 10 కిమీల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. పాకిస్థాన్ లో భూకంపం వచ్చిన తర్వాత గ్జిజాంగ్ లో ఉదయం 3.45 కి 140 కిమీలో లోతు నుంచి భూకంపం సంభవించింది. ఈ మూడు భూకంపాలు మూడు దేశాల్లో ఒకే సమయంలో సంభవించడం అధికారులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.