ప్రపంచ వాతావరణంలోనే కాకుండా అంతరిక్షంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. భూమి (Earth ) తన చుట్టూ తాను తిరిగే భ్రమణ వేగంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. భూమి ఒకసారి పూర్తిగా తిరగడానికి సాధారణంగా 24 గంటలు పడుతుందన్న మన నమ్మకాన్ని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. భూమి కొన్ని రోజులలో మరింత వేగంగా తిరుగుతూ, ప్రతి రోజు 1.3 నుండి 1.66 మిల్లీ సెకన్ల వరకు తగ్గుతోందని వారు వెల్లడించారు.
Vamshi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..మళ్లీ జైలు జీవితం తప్పదా..?
చంద్రుని స్థానం భూమి భ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, 2024 జూలై 5వ తేదీన భూమి సాధారణ రోజుకు కంటే 1.66 మిల్లీ సెకన్లు తక్కువగా తిరిగినట్లు రికార్డు చేశారు. అలాగే జూలై 9, జూలై 22, ఆగస్టు 5 తేదీల్లో కూడా భూమి వేగం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు దూరం అవుతున్న కొద్దీ, భూమి భ్రమణ సమయం కూడా మారుతూ వస్తుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది బొంగరం ఒకవేళ తన దిశను మార్చినట్లయితే ఎలా వేగంగా తిరుగుతుందో, అదే విధంగా భావించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
భూమి భ్రమణ వేగానికి కారణాలు కేవలం అంతరిక్ష సంబంధమైనవి మాత్రమే కావు. మంచు కరగడం, భూగర్భ జలాల కదలిక, భూకంపాలు, వాతావరణ మార్పులు వంటి ప్రకృతి ఘటనలు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా 2011లో జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల భూమి ఒకరోజు వ్యవధిని 1.8 మైక్రోసెకన్ల వరకు తగ్గించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పులు మన దైనందిన జీవితంపై తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో టైమ్ కీపింగ్, శాటిలైట్ వ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.