Site icon HashtagU Telugu

EAM Jaishankar: భారత్ వైపు రష్యా అడుగులు.. బిజినెస్ డీల్స్

EAM Jaishankar

New Web Story Copy (6)

EAM Jaishankar: ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా ఇప్పుడు భారత్‌తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా ఉప ప్రధాని, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డెనిస్ మంటురోవ్ (manturov) ఈరోజు న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌తో సమావేశమయ్యారు. రష్యా ఉప ప్రధానితో జైశంకర్‌కి ఇది రెండో సమావేశం. ఏప్రిల్ 17న జైశంకర్ మరియు మంతురోవ్ రష్యా మరియు భారతీయ వ్యాపార ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు.

రష్యా-భారత్ వ్యాపార ఒప్పందాలపై మంతూరోవ్ మాట్లాడుతూ…యురేషియన్ ఎకనామిక్ కమిషన్‌తో కలిసి, భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయడానికి ఎదురుచూస్తున్నామని తెలిపారు.పెట్టుబడుల రక్షణ కోసం రష్యా-భారత్ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు రష్యా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఢిల్లీలో జరిగిన భారత్-రష్యా బిజినెస్ మీటింగ్ పై జైశంకర్ ప్రసంగించారు. భారత్, రష్యాలు ఇరువైపులా వ్యాపారాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జైశంకర్ అన్నారు. భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌’గా మార్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. గత నెలలో కూడా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు మంతురోవ్ వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించడం గమనార్హం.

Read More: Viveka Murder Case: వివేకాను హత్య కేసులో ట్విస్ట్.. దస్తగిరి సంచలన నిజాలు!