Site icon HashtagU Telugu

Corona: చైనా అలా చేసినందు వల్లే కరోనా పడగ విప్పుతోందా ? వైజ్ఞానిక నిపుణుల వార్నింగ్ బెల్స్..!

China Population

China Population

చైనాలో కరోనా (Corona) గురించి భయానక నివేదికలు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం.. కరోనా (Corona) ఒమైక్రోన్ వేరియంట్ యొక్క సబ్-వేరియంట్ “BF.7” చైనాలో వినాశనం సృష్టిస్తోంది. పరిస్థితి ఎలా మారిందంటే.. రోడ్ల కంటే ఆసుపత్రుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంది.అయినా చైనా ప్రభుత్వం ఎప్పుడూ తన దేశ అంతర్గత వ్యవహారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. 2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు చైనా ప్రభుత్వం దేశంలో కరోనా వ్యాప్తి గురించి పరిమిత సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది. అక్కడి మీడియా కూడా అధికారిక లెక్కలను మాత్రమే అందించింది. జీరో కోవిడ్ పాలసీని చైనా సడలించినప్పటి నుంచి భారీగా కరోనా కేసులు బయటపడటం మొదలైంది.

చైనా ప్రజలలో హైబ్రిడ్ రోగనిరోధక శక్తి లేకపోవడంతో ఇలా జరిగింది. BF.7 వేరియంట్‌ను జూలైలోనే భారతదేశంలో గుర్తించడం జరిగింది.జనాభాలో ఎక్కువ మందికి హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ఉన్న దేశాలలో కరోనా యొక్క ఏదైనా కొత్త వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉండటం గమనార్హం.  చైనాలో ప్రజల కోసం 7 వ్యాక్సిన్‌లను మాత్రమే తయారు చేశారు. అయితే వాటి పనితీరుపై నిపుణులు ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తుతున్నారు.

ఇటీవల, అమెరికన్ వ్యాక్సిన్ నిపుణుడు అలీ మొక్దాద్ mRNA రకం వ్యాక్సిన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని చైనాకు సలహా ఇచ్చారు. ఎమ్‌ఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వకపోతే, ఏప్రిల్ నెల నాటికి చైనాలో పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కరోనాను నిరోధించడానికి పాక్స్‌లోవిడ్ ఔషధాన్ని చైనా ఫిబ్రవరిలో ఆమోదించినప్పటికీ, ఇప్పటివరకు ఎంత ఔషధాన్ని దిగుమతి చేసిందనే దానిపై సమాచారం లేదు. చైనాలోని బీజింగ్, వూహాన్ నగరాలు కరోనాతో వణికిపోయాయి. అయితే ఆ నగరాల్లో 2020 ఏప్రిల్ వరకు చాలా తక్కువ రోజుల పాటు లాక్ డౌన్ అమలైంది.ఇంత స్వల్ప కాలిక లాక్ డౌన్ల వల్లే చైనాలో కరోనా సజీవంగా, క్రియాశీలంగా ఉండగలిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకొందరు జీరో కోవిడ్ పాలసీని దీర్ఘకాలం పాటు చైనా కొనసాగించడం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.