Site icon HashtagU Telugu

Dubai: దుబాయ్ లో కొత్తగా 55 పార్కులు

Dubai

Logo (6)

Dubai: దుబాయ్ ని మరింత సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది అక్కడి పాలకవర్గం. ఈ మేరకు రెసిడెన్షియల్ ఏరియాలను ఎంచుకున్నారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. తాజాగా అక్కడి మునిసిపల్ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జీవన ప్రమాణాలను పెంచడానికి రాబోయే రోజుల్లో 55 నూతన పార్కులు మరియు స్క్వేర్‌లను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. దాదాపు 93 మిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.2,10,26,84,430 వ్యయంతో నిర్మించనున్నారు.

దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ మాట్లాడుతూ.. దుబాయ్ ఎమిరేట్‌లో 125 పార్కులు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్వేర్‌లు మరియు ప్లేగ్రౌండ్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నట్టు ఆయన తెలిపారు. పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించడానికి మేము ఎప్పుడూ ముందుంటామని అన్నారు. సిటిజన్ హౌసింగ్ ఏరియాల్లో 2019 మరియు 2021 మధ్య 70 సౌకర్యాలను నిర్మించినట్లు అల్ హజ్రీ తెలిపారు.

Also Read: Telangana : గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్​ చేపట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు

Exit mobile version