Site icon HashtagU Telugu

Dubai Floods : వరదల్లో ఎడారి నగరం.. వీడియోలు వైరల్

Dubai Floods

Dubai Floods

Dubai Floods : రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు దుబాయ్‌ను వణికిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో దుబాయ్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో దుబాయ్ వీధుల్లో ఎక్కడ చూసిన వరదే కనిపించింది. ఈనేపథ్యంలో యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌‌లను జారీ చేసింది. బీచ్‌ల వద్దకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరించింది. భద్రత దృష్ట్యా ఇండ్లలోనే ఉండాలని సూచించింది.మరోవైపు వరదల కారణంగా దుబాయ్‌లో రవాణా వ్యవస్థ స్తంభించింది. వర్షాల కారణంగా రోడ్డు రవాణా, వైమానిక రవాణాకు అంతరాయం కలిగింది.

We’re now on WhatsApp. Click to Join.

భారీ వర్షాల నేపథ్యంలో యూఏఈ పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానికులు దుబాయ్‌ నగరం నీట మునిగిన పలు దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వరదల ధాటికి బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్ల ఎదుట పార్కింగ్ చేసిన కార్లు మునిగిపోయాయి. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు(Dubai Floods)  శ్రమిస్తున్నారు.

Also Read: India Win – 100 Crore : ఇండియా గెలిస్తే 100 కోట్లు పంచుతారట!