Urinates On Female Passenger: ఇదేం పని.. విమానంలో మహిళపై మూత్రం పోసిన ప్యాసింజర్

ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో దారుణంగా ప్రవర్తించాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళా ప్యాసింజర్ (Female Passenger) పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. న్యూయార్క్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 11:10 AM IST

ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో దారుణంగా ప్రవర్తించాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ మహిళా ప్యాసింజర్ (Female Passenger) పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. న్యూయార్క్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు మహిళ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆ మహిళ టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

మీడియా నివేదిక ప్రకారం.. ఈ ఘటన నవంబర్ 26, 2022న జరిగింది. తన భద్రత విషయంలో విమాన సిబ్బంది కనీసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని.. కనీసం తనను పట్టించుకోలేదని ఆమె లేఖలో ఆరోపించింది. వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ మహిళ రాసింది. తన ప్రయాణాన్ని వివరిస్తూ.. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం A-102 ఢిల్లీకి బయలుదేరిందని రాశారు. ఈ ప్రయాణంలో భోజనం చేసిన తర్వాత, విమానం లైట్లు ఆఫ్ చేయబడ్డాయి.

Also Read: 29 IPS Officers: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు సీటుపైనే మూత్ర విసర్జన చేశాడు. మేము అభ్యంతరం చెప్పాము కానీ ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. ఓ వ్యక్తి తన సీటు దగ్గరకు వచ్చి తన ప్యాంట్ జిప్ తీశాడని ఆ తర్వాత ఆమెపై మూత్రం పోశాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉండిపోయాడు. పక్కనే ఉన్న మరో ప్యాసింజర్ అక్కడి నుంచి వెళ్లమని అరవగా అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి మూత్రం కారణంగా తన వస్తువులన్నీ తడిసిపోయాయని మహిళ తెలిపింది. ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి క్రిమిసంహారక మందు పిచికారీ చేసి వెళ్లిపోయింది. దీని తర్వాత చర్యలు తీసుకోవాలని మహిళ కోరినా ఏమీ జరగలేదు. ఆ మగ ప్రయాణికుడిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెట్టాలని లేఖలో మహిళ రాసింది.