Trending

100 People Killed : సిరియా సైనిక అకాడమీపై డ్రోన్ ఎటాక్.. 100 మందికిపైగా మృతి

100 People Killed : సిరియాలో ఉగ్రవాదులు కలకలం క్రియేట్ చేశాయి.

Published By: HashtagU Telugu Desk
100 People Killed

100 People Killed

100 People Killed : సిరియాలో ఉగ్రవాదులు కలకలం క్రియేట్ చేశాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోంస్‌ ప్రాంతంలోని సిరియన్ మిలిటరీ అకాడమీపై ఓ ఉగ్ర సంస్థ జరిపిన డ్రోన్ దాడిలో 100 మందికిపైగా  ప్రాణాలు కోల్పోయారు. మరో 125 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో సగం మంది సైనిక గ్రాడ్యుయేట్లు అని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్లతో టెర్రరిస్టులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి సంతాప సూచకంగా సిరియా ప్రభుత్వం ఈరోజు నుంచి ఆదివారం వరకు (మూడు రోజుల పాటు) సంతాప దినాలను ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join

టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖహ్తానియేహ్ చమురు ప్రదేశాలపై  కుర్దిష్ మిలిటెంట్ గ్రూపులు దాడి చేశాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతంలోని రెండు పవర్ స్టేషన్లు, ఒక డ్యామ్ పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కుర్దు మిలిటెంట్  గ్రూపులపై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ హెచ్చరించారు. ఈక్రమంలోనే కుర్దిష్ గ్రూపుల ఆధీనంలో ఉన్న సిరియా ఈశాన్య ప్రాంతంపై టర్కీ ఆర్మీ(100 People Killed) జరిపిన వైమానిక దాడుల్లో 9 మంది హతమయ్యారు.

Also read : Assembly Polls Schedule: ఈనెల 12న అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ ?

  Last Updated: 06 Oct 2023, 07:27 AM IST
Exit mobile version