అమెరికాలోని న్యూ ఆర్లీన్స్(New Orleans)లో నూతన సంవత్సర (New Year) వేళ ఘోరం జరిగింది. అతి వేగంతో ఓ కారు జన సమూహాన్ని ఢీకొట్టింది. కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో జరుగుతున్న నూతన సంవత్సరం వేడుకల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా (killing 10 people), మరో 30 మందికి (Injuring 30) గాయాలైనట్లు సమాచారం. వాహనానికి చెందిన డ్రైవర్ జనాలను ఢీ కొట్టడమే కాదు, అనంతరం బయటకు వచ్చి జన సమూహం ఫై కాల్పులు (Driver Firefight) జరిపాడు.
ఈ ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం వద్ద షుగర్ బౌల్ కాలేజీ ఫుట్‌బాల్ ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో జనాలు గుమికూడారు. ఇదే క్రమంలో కారు వేగంగా జనాలను ఢీకొట్టింది. ఈ ఘటన అనంతరం వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు కార్ డ్రైవర్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనుమానిస్తున్నామని నగర పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా నగర మేయర్ లాటోయా కాంట్రెల్ పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ మాత్రం దీనిని తోసిపుచ్చింది. ఉగ్రదాడి కాదని అసిస్టెంట్ ఎఫ్‌బీఐ ఏజెంట్ ప్రకటించారు. అయితే, ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు గుర్తించామని, ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు.
Read Also : Slogans War : బీఆర్ఎస్‌లో ‘‘కాబోయే సీఎం’’ కలకలం.. కవిత, కేటీఆర్ అనుచరుల స్లోగన్స్