Site icon HashtagU Telugu

Double decker flight : విమానంలో డబుల్ డెక్కర్ సీట్ కాన్సెప్ట్.. అదిరిపోయింది క‌దా..

Double decker flight concept and design in Germany goes viral

Double decker flight concept and design in Germany goes viral

విదేశాల‌కు వెళ్లాల‌న్నా.. దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నా డ‌బ్బున్న‌వారితో పాటు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల వారుకూడా ఎక్కువ శాతం మంది విమానాల‌ను(Flights) ఆశ్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కోసారి సీట్లుకూడా దొర‌క‌ని ప‌రిస్థితి. కొన్ని విమానాల్లో నెల రోజుల ముందే సీట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల‌కు చెక్ పెట్టాల‌ని జ‌ర్మ‌నీకి చెందిన యువ‌కుడు భావించాడు. విమానంలో డ‌బుల్ డెక్క‌ర్(Double decker) సీట్ల‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంద‌ని భావించారు. ఆ యువ‌కుడికి వ‌చ్చిన ఆలోచ‌న మేర‌కు డబుల్ డెక్కర్ సీట్ కాన్సెప్ట్ ను రూపొందించి జర్మనీలో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్స్‌పోలో ప్రదర్శించాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

అలెజాండ్రో న్యూనెజ్ విసెంటే అనే 23ఏళ్ల వ్య‌క్తి విమానంలో డబుల్ డెక్క‌ర్ సీటింగ్ ను త‌యారు చేశారు. ఎక్స్ పోలో ప్ర‌ద‌ర్శించిన త‌రువాత అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. నెటిజ‌న్లు తమ‌దైన శైలిలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అలెంజాండ్రో ప్లాన్ సూప‌ర్ అంటూ అభినందిస్తున్నారు. మేం ప‌లుసార్లు విమానాల్లో ఇబ్బందిప‌డుతూ ప్ర‌యాణించాల్సి వ‌స్తుంది. విమానంలోనూ డ‌బుల్ డెక్క‌ర్ సీటింగ్ విధానంతో ఇబ్బందిలేకుండా ప్ర‌యాణించొచ్చు అని ఓ నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

అలెజాండ్రో రూపొందించిన విమానంలో డ‌బుల్ డెక్క‌ర్ సీటింగ్ కు నెటిజ‌న్ల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తుంది. డబల్ డెక్కర్ బస్సు, ట్రైన్ చూశాము, ఫ్లైట్ ఇదే మొదటిసారి, ఇవి త్వరగా అందుబాటులోకి రావాలి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Also Read : 14 Year Software Engineer : 14 ఏళ్లకే స్పేస్‌ఎక్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాడు