Trump – Blood bath : నేను అధ్యక్షుడిని కాకపోతే అమెరికాలో రక్తపాతమే.. ట్రంప్ వార్నింగ్

Trump - Blood bath : ఈసారి అమెరికా ప్రెసిడెంట్‌గా తనను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

  • Written By:
  • Updated On - March 17, 2024 / 10:30 AM IST

Trump – Blood bath : ఈసారి అమెరికా ప్రెసిడెంట్‌గా తనను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఓహియో స్టేట్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు తనకు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. తాను ఈసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వకపోతే  దేశంలో ప్రజాస్వామ్యం అంతం అవుతుందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్.. చెత్త ప్రెసిడెంట్ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో నేను గెలవకపోతే, అమెరికాలో మరోసారి ఎన్నికలు జరుగుతాయని అనుకోవట్లేదని  ట్రంప్(Trump – Blood bath) వెల్లడించారు. మెక్సికోలో కార్లను తయారు చేసి.. వాటిని అమెరికాలో అమ్మాలనే చైనా ప్లాన్లపై  ఆయన మండిపడ్డారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ కార్లను అమెరికాలో చైనా విక్రయించకుండా ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join

ట్రంప్‌ మళ్లీ ఓడిపోతారు : బైడెన్

ట్రంప్ వ్యాఖ్యలపై  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయం స్పందించింది. రాజకీయ బెదిరింపులను ట్రంప్ రెట్టింపు చేస్తున్నారని  తెలిపింది. ‘‘ట్రంప్ మరో జనవరి 6 ఘటన కావాలని కోరుకుంటున్నారు. అందుకే బ్లడ్ బాత్ వంటి పదాలతో వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఆయనకు మరోసారి అమెరికన్లు ఓటమి రుచిని  చూపిస్తారు. ఎందుకంటే ట్రంపు వ్యాఖ్యలు తీవ్రవాదాన్ని, హింసను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఇలాంటి చేష్టలు చేస్తున్నందు వల్ల అమెరికా ప్రజలు ట్రంప్‌ను ఇంకోసారి కూడా తిరస్కరిస్తారు’’  అని బైడెన్ తెలిపారు.

Also Read : Pawan Kalyan : ఈసారైనా పవన్ కల్యాణ్ నెగ్గుతారా ? పిఠాపురంలో పరిస్థితేంటి ?

నవంబరు 5న జరిగే 2024 అమెరికా అధ్యక్ష పోరులో అమీతుమీ తేల్చుకొనేందుకు బైడెన్, ట్రంప్ సిద్ధమయ్యారు. 81 ఏళ్ల బైడెన్‌ జార్జియా ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీలో విజయం సాధించి, డెమొక్రటిక్‌ పార్టీ అధికారిక నామినేషన్‌కు అవసరమైన 1968 మంది ప్రతినిధులను సొంతం చేసుకున్నారు. బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని జులైలో జరిగే జాతీయ కన్వెన్షన్‌లో డెమొక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది.77 ఏళ్ల ట్రంప్‌ కూడా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వానికి అవసరమైన 1215 మంది ప్రతినిధుల మార్కును దాటారు. దీంతో వరుసగా మూడోసారి పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలిచారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆగస్టులో జరిగే జాతీయ కన్వెన్షన్‌లో పార్టీ ఖరారు చేయనుంది. 1956 తర్వాత వరుసగా రెండు అధ్యక్ష ఎన్నికల్లో ఒకే ప్రత్యర్థుల మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి.