అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Elections) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ విజయం సాధించినట్లే అని ఫిక్స్ అవ్వొచ్చు. ఇప్పటికే ఆయన 247 ఓట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ (270) వైపు దూసుకెళ్తున్నారు. స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ ఆధిపత్యంలో ఉండటంతో ఆయన గెలుపు లాంఛనమేనని నేషనల్ మీడియా తెలిపింది. 95% ట్రంప్ గెలిచే ఛాన్స్ ఉందని NYT తెలిపింది. కాగా, రిజల్ట్స్ పూర్తయ్యే వరకూ ఓటమిని ఒప్పుకోమని కమలా ఫాలోవర్స్ అంటున్నారు.
ఇదిలా ఉంటె విజయం ఫిక్స్ కావడం తో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ..ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని పేర్కొన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి నా ధన్యవాదాలు. ఇది అమెరికన్లు అందరూ గర్వించే సమయం’ అని ఆయన పేర్కొన్నారు.
ఇక నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందగా, న్యూ మెక్సికోలో కమల హారీస్ విజయం సాధించారు. కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్‌ల కమలా హ్యారీస్ గెలుపొందారు. అదే విధంగా..రిపబ్లికన్ల కంచుకోలుగా ఉన్న రాష్ట్రాలైన అలబామా, అర్కాన్సాస్, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, లూసియానా, మిస్సోరీ, మిస్సిస్సిప్పి, మోంటానా, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహియో, ఓక్లహోమా, సౌత్ కరోలినా, సౌత్ డకోటా, టేనస్సీ, టెక్సాస్, ఉటా వెస్ట్ వర్జీనియా, వ్యోమింగ్‌లో ట్రంప్ గెలుపొందారు. కమలా హరీస్ అతి పెద్ద రాష్ట్రం కాలిఫోర్నియాలో విజయం సాధించారు.
డెలవేర్లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి జాన్ వేలెన్ 3 తో, సారా మెక్బ్రైడ్ తలపడ్డారు. సారాకు 95 శాతం ఓట్లు పోలవగా..వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లో 9 మంది భారతీయ అమెరికన్లు బరిలో నిలబడిన విషయం తెలిసిందే.
భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో విజయాన్ని అందుకున్నారు. ఇల్లినాయిస్ (Illinois)లో 8 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ (8th Congressional District) నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
Read Also : Kitchen Tips : పప్పులు ఎక్కువ కాలం చెడిపోకుండా ఇంట్లో ఎలా నిల్వ చేసుకోవచ్చో చూడండి..!