Site icon HashtagU Telugu

English Language: అమెరికాలో అధికారిక భాషగా ఇంగ్లిష్.. ఆంగ్లంపై ఆసక్తికర విశేషాలివీ

Donald Trump English Official Language Us Govt

English Language: ఇంగ్లిష్‌ భాష.. ప్రపంచ రారాజుగా వెలుగొందుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా దాన్ని అధికార భాషగా ప్రకటించింది. ఈమేరకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికా ప్రభుత్వ నిధులు పొందే ప్రభుత్వ సంస్థలు, శాఖలు ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్లోనూ సేవలను తప్పనిసరిగా అందించాలన్న గత ప్రభుత్వ  ఉత్తర్వులను ట్రంప్ ఉపసంహరించారు. బిల్‌క్లింటన్ హయాంలో ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై సేవలు, ఉత్తర ప్రత్యుత్తరాలను ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్లో కొనసాగించాలా వద్దా అనే దానిపై ఆయా సంస్థలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇంగ్లిష్ అధికారిక భాషగా మారడంతో అమెరికా సమాజంలో ఐక్యత, సామర్థ్యాలు పెరుగుతాయని ట్రంప్ భావిస్తున్నారు.

Also Read :Meenakshi Chaudhary: ‘మహిళా సాధికారత’ బ్రాండ్ అంబాసిడర్‌గా హర్యానా బ్యూటీ

అమెరికా రాష్ట్రాల్లో ఇప్పటికే..

250 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటివరకు అధికారిక భాష అనేది లేదు. అయితే అమెరికాలోని వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ఇంగ్లిష్‌ను తమ అధికారిక భాషగా గుర్తించాయి. 30 రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. జాతీయ స్థాయిలో ఇంగ్లిష్‌ను(English Language) అధికారిక భాషగా ప్రవేశపెట్టేందుకు గతంలో అమెరికా చట్టసభల్లో ప్రయత్నాలు జరిగినా.. అవి సక్సెస్ కాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ట్రంప్ ఆ విషయంలో ముందడుగు వేశారు. 2019 యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం.. అమెరికాలో 330 కంటే ఎక్కువ భాషలను మాట్లాడతారు. అయితే దాదాపు 78 శాతం మంది ఇళ్లలో ఇంగ్లీషే మాట్లాడతారు. దీంతోపాటు స్పానిష్, చైనీస్, తగలోగ్, ఇతరత్రా స్థానిక అమెరికన్ భాషలు కూడా వినియోగంలో ఉన్నాయి.

  1. అమెరికా: అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం మేరకు అమెరికాలో ఇంగ్లీష్ అధికార భాషగా గుర్తింపు పొందింది.
  2. యునైటెడ్ కింగ్‌డమ్: ఈ దేశం ఇంగ్లీషు జన్మస్థలం. అక్కడ ఇది ఏకైక అధికారిక భాష.
  3. నైజీరియా: దేశంలో 500 కంటే ఎక్కువ స్థానిక భాషలున్నా, పరిపాలన, విద్య వ్యవహారాల్లో ఇంగ్లీషే అధికారిక భాష.
  4. దక్షిణాఫ్రికా: దేశంలోని 11 అధికారిక భాషల్లో ఇదొకటి. కానీ అత్యంత ప్రభావవంతమైనది.
  5. సింగపూర్: ఈ దేశంలో మలయ్, మాండరిన్, తమిళంతో పాటు ఇంగ్లీష్ కూడా అధికారిక భాషే.
  6. ఫిలిప్పీన్స్: ఈ దేశంలో తగలోగ్‌తో పాటు ఇంగ్లీష్ అధికారిక భాష.
  7. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్: ఈ రెండు దేశాల్లో ఇంగ్లీష్ అధికారిక భాష.
  8. కెనడా: ఈ దేశంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ అధికారిక భాషలు.
  9. భారతదేశం: హిందీతో పాటు ఇంగ్లీష్ సహ అధికారిక భాష. భారత్‌లో 12.5 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. చైనాలో ఈ సంఖ్య 20 కోట్లకుపైనే ఉంటుంది.
  10. ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడతారు.