ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు..రాజకీయ నేతలంతా (Political Leaders) తమ రూపాలు మార్చుకుంటారు. ఏసీ గదుల్లో ఉండే వారు మండుఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల వద్దకు వచ్చి అనేక హామీలు ప్రకటిస్తూ..ప్రజలపై ఎక్కడాలేని ప్రేమను కుమ్మరిస్తుంటారు. చెప్పులు కుట్టడం దగ్గరి నుండి కుండలు చేసేవారు ప్రతి ఒక్క పనిలో భాగం అవుతూ..మీకు నేనున్నా అంటూ హామీ ఇస్తుంటారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు పక్క దేశాల్లో కూడా ఇదే తంతు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు (2024 US Presidential Election) సమీపిస్తోన్న వేళ రిపబ్లికన్, డెమోక్రటిక్ అభ్యర్థులు (Republican, Democratic Candidates) ప్రచారంలో జోరు పెంచారు. తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Republican Presidential Candidate Donald Trump) పెన్సిల్వేనియాలోని మెక్డొనాల్డ్ స్టోర్లో పనిచేశారు. స్టోర్లో స్వయంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారుచేసి వాటిని కస్టమర్లకు అందించారు. దీంతో వేలాది మంది ట్రంప్ సపోర్టర్లు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఈ ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ద్వారా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని మరియు ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరుగనున్నాయి. ప్రైమరీలలో ఎక్కువ మంది మద్దతు పొందిన అభ్యర్థిని అధికారికంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారు. డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీలు తమ కన్వెన్షన్లలో ఉపాధ్యక్ష అభ్యర్థిని కూడా ప్రకటిస్తాయి.
Read Also : CM Chandrababu : దేశంలోనే ఏపీ పోలీస్‌లకు ప్రత్యేక బ్రాండ్ ఉంది: సీఎం చంద్రబాబు