అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం (Trump Family) ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడుతోంది. మొబైల్ ఫోన్ల తయారీ మరియు సర్వీస్ రంగంలోకి ట్రంప్ ఫ్యామిలీ ప్రవేశించనుందని ఎరిక్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ట్రంప్ బ్రాండ్ (Trump Brand) పేరుతో మొబైల్ ఫోన్ (Mobile Phone) సర్వీసు ప్రారంభించేందుకు అధికారికంగా లైసెన్స్ లభించిందని ఆయన వెల్లడించారు. ఈ కొత్త వ్యాపారంతో అమెరికా మార్కెట్‌లో స్థానికంగా తయారయ్యే ఫోన్లకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Double Bedrooms : లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇస్తాం – మంత్రి పొంగులేటి
ఈ ప్రాజెక్టులో భాగంగా ‘T1’ పేరుతో మొట్టమొదటి ట్రంప్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి రాబోతోంది. బంగారు రంగులో ఉండే ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమెరికాలోనే పూర్తిగా తయారయ్యే ఈ ఫోన్, ఆగస్టు 2025 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ఫ్యామిలీ తెలిపింది. “మేడ్ ఇన్ USA”గా నిలిచే ఈ ఫోన్ మీద అమెరికన్ గౌరవం వుంది అన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ట్రంప్ బ్రాండ్ ‘T1’ మొబైల్ ఫోన్ ధరను 499 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్టు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ. 41,000 పరిధిలో ఉంటుంది. ఫోన్ ఫీచర్లు ఇంకా వెల్లడించలేదు కానీ, దేశభక్తి, స్వదేశీ ఉత్పత్తుల పట్ల ఆసక్తి కలిగిన అమెరికన్లను లక్ష్యంగా పెట్టుకుని ట్రంప్ ఫ్యామిలీ మార్కెట్‌లోకి దిగుతున్నట్లు అర్థమవుతోంది. రాజకీయంగా చురుగ్గా ఉండే ట్రంప్ పేరు వ్యాపార రంగానికీ మంచి గుర్తింపునిచ్చే అవకాశముంది.