అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో (Assassination Attempt) ఆయన కుడి చెవికి గాయం కావడంతో వెంటనే భద్రతా సిబ్బంది హాస్పటల్ లో చేర్చారు. చికిత్స అనంతరం ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా సిబ్బంది దుండగుడిని కాల్చి చంపారు. కాల్పుల తర్వాత లేచి ‘ఫైట్’ అంటూ ట్రంప్ నినాదాలు చేశారు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికాలో అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై దాడులు కొత్తేం కాదు. గతంలోనూ పలువురు నేతలపై దాడులు జరిగాయి. 1981లో అధ్యక్షుడు రొనాల్డ్ రెగాన్, 1975లో గెరాల్డ్ ఫోర్డ్, 1972లో జార్జి వాలెస్, 1968లో రాబర్ట్ కెనడీ, 1963లో జాన్ F కెనడీ, 1993లో ఫ్రాంక్లిన్ రూసెవెల్ట్, 1912లో థియోడర్ రూసెవెల్ట్, 1901లో మెక్ కిన్లీ, 1865లో అబ్రహం లింకన్పై దాడులు జరిగాయి. వీరిలో పలువురు మరణించగా, మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గాయాలతో బయటపడ్డాడు.
ఇక ఈ ప్రమాదం వార్త తెలియగానే డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ (PM Modi) సంఘీభావం తెలిపారు. ‘నా స్నేహితుడు ట్రంప్పై దాడిని ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని FBI గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్క్ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ (Thomas Matthew Crooks)గా అధికారులు గుర్తించారు. ఏఆర్ 15 ఆటోమెటిక్ గన్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. థామస్ మాథ్యూ క్రూక్స్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ట్రంప్‌పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Virat Kohli- Anushka Sharma: విరాట్-అనుష్క లండన్‌లోనే ఉంటారా? వైరల్ అవుతున్న వీడియోపై పలు ప్రశ్నలు..?