Foreign Aid Freeze : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు షాకిచ్చే నిర్ణయం ఇది. ఉక్రెయిన్ సహా చాలా దేశాలకు అందిస్తున్న ఆర్థిక, సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కేవలం ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు తమ ఆర్థిక, సైనిక సహాయం కొనసాగుతుందని తెలిపారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తదుపరిగా ఏం చేస్తుందో వేచిచూడాలి. రష్యా లాంటి అణ్వాయుధ దేశంతో గత రెండున్నర ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం చేసిందంటే దానికి కారణం.. అమెరికా చేసిన సాయం!! లేదంటే ఇప్పటివరకు యుద్ధ బరిలో రష్యా ఎదురుగా ఉక్రెయిన్ నిలువలేకపోయేది.
Also Read :Vijayasai Reddy : విజయసాయి రాజీనామా వెనుక వ్యూహం ఏంటి..?
ఇజ్రాయెల్, ఈజిప్టులకు కంటిన్యూ
తదుపరిగా రష్యాతో శాంతి చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపే క్రమంలోనే ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని ట్రంప్(Foreign Aid Freeze) ఆపేసినట్లు తెలుస్తోంది. అమెరికా నిధులు విదేశాలకు మళ్లడాన్ని ఆపుతానని, వాటిని తమ దేశ వికాసానికి వినియోగిస్తానని ట్రంప్ మొదటినుంచీ చెబుతూ వస్తున్నారు. డీలాపడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందాలంటే విదేశాలకు సాయాలను ఆపాలనేది ట్రంప్ వాదన. పశ్చిమాసియాలో అమెరికాతో వ్యూహాత్మక సైనిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఇజ్రాయెల్, ఈజిప్టులకు మాత్రం సాయాన్ని కంటిన్యూ చేయనున్నారు.
Also Read :Kodali Nani Resign : వైసీపికి కొడాలి నాని రాజీనామా..? అసలు నిజం ఇదే..!!
అమెరికా నిధులు అమెరికా ప్రయోజనాల కోసమే
‘‘నూతన ప్రభుత్వం సమీక్షించి, తుది నిర్ణయం తీసుకున్నాకే తదుపరిగా విదేశాలకు ఆర్థికసాయం ప్రక్రియ మొదలవుతుంది’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ నిధులు అమెరికా ప్రయోజనాల కోసమే ఉపయోగపడాలి అనేది దేశాధ్యక్షుడు ట్రంప్ విధానమని ఆయన తేల్చి చెప్పారు. ఈమేరకు ట్రంప్ సర్కారు ఒక అధికారిక మెమోను జారీ చేసింది. కాగా, ట్రంప్ తాజా ప్రకటనతో ఆఫ్రికా దేశాలకు బాగా ఇబ్బంది కలగనుంది. ఆ దేశాల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిరోధక కార్యక్రమాల అమలు కోసం ఏటా పెద్దమొత్తంలో యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్‌ను అమెరికా సరఫరా చేస్తుంటారు. జార్జ్ బుష్ హయాంలో 2003 నుంచి ఆఫ్రికా దేశాలకు ఈ మందులను అమెరికా అందిస్తోంది. ఇప్పుడు వాటి పంపిణీ జరగకుంటే ఆయా దేశాల్లో ఎయిడ్స్ వ్యాప్తి పెరిగే ముప్పు ఉంది.