Vodka Bottle: కడుపులో వోడ్కా బాటిల్.. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స..!

నేపాల్‌లో 26 ఏళ్ల యువకుడి కడుపులో నుంచి వోడ్కా మద్యం బాటిల్‌ (Vodka Bottle)ను బయటకు తీయడంలో వైద్యులు విజయం సాధించారు. ఈ కేసు రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి సంబంధించినది. ఇక్కడ 26 ఏళ్ల నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు.

Published By: HashtagU Telugu Desk
Vodka Bottle

Resizeimagesize (1280 X 720) (1) 11zon

నేపాల్‌లో 26 ఏళ్ల యువకుడి కడుపులో నుంచి వోడ్కా మద్యం బాటిల్‌ (Vodka Bottle)ను బయటకు తీయడంలో వైద్యులు విజయం సాధించారు. ఈ కేసు రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి సంబంధించినది. ఇక్కడ 26 ఏళ్ల నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. కడుపులో భరించలేని నొప్పి వచ్చింది. వైద్య పరీక్షల్లో కడుపులో ఏదో ఉందని నిర్ధారణ అయింది. దీని తర్వాత వైద్యుల బృందం అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

ఆపరేషన్ సమయంలో రోగి కడుపులోంచి బాటిల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స తర్వాత రోగి ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు. అందిన సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ తర్వాత ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ‘ది హిమాలయన్ టైమ్స్’ వార్తాపత్రిక కథనం ప్రకారం.. రోగి భరించలేని నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. వైద్యపరీక్షలో పొట్టలో ఏదో ఉన్నట్టు సంకేతాలు వచ్చాయి. దీంతో వైద్యులు ఆపరేషన్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. వోడ్కా బాటిల్‌ను బయటకు తీయడానికి రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు.

Also Read: MLC Kavitha: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్

మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని శస్త్రచికిత్స చేసిన వైద్యుడు తెలిపారు. పేగు పగిలిపోవడంతో మలం కారుతోంది. ఆపరేట్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. కానీ శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇప్పుడు రోగి ప్రమాదం నుండి బయటపడ్డాడు. 26 ఏళ్ల నూర్సాద్ మన్సూరి తన స్నేహితుడి కారణంగా ఆరోగ్యం క్షీణించిందని పోలీసులు తెలిపారు. అతను స్నేహితులతో కలిసి విపరీతంగా మద్యం సేవించాడు. మత్తులో అతని స్నేహితులలో ఒకరు అతని ప్రైవేట్ పార్ట్ ద్వారా అతని కడుపులో బాటిల్‌ను బలవంతంగా చొప్పించారు. ఈ కేసులో మన్సూరి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  Last Updated: 11 Mar 2023, 07:31 AM IST