US President Vs World Leaders : డొనాల్డ్ ట్రంప్ రేపు (సోమవారం) అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈతరుణంలో అమెరికా అధ్యక్షుడు పొందే శాలరీపై అంతటా చర్చ జరుగుతోంది. అగ్రరాజ్యం అంటే అమెరికా కాబట్టి ఆ దేశ ప్రెసిడెంట్ శాలరీ చాలా ఎక్కువని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి అమెరికాను మించిన రేంజులో కొన్ని దేశాలు తమ ప్రభుత్వాధినేతలకు(US President Vs World Leaders) వేతనాలు ఇస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
Also Read :Shunya Air Taxi : నగరాల్లో గగనవిహారం.. ‘శూన్య’ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఇదిగో
అమెరికాను మించిన రేంజు..
- సింగపూర్ ప్రధానమంత్రి వార్షిక వేతనం రూ.13.85 కోట్లు.
- హాంకాంగ్ ప్రభుత్వ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వార్షిక వేతనం రూ.6 కోట్లు.
- స్విట్జర్లాండ్ అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.4.93 కోట్లు.
- ఆస్ట్రేలియా అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.3.57 కోట్లు.
- అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం రూ.3.46 కోట్లు మాత్రమే.
Also Read :EPFO New Feature : పీఎఫ్ ఖాతా ఉందా ? సరికొత్త ఫీచర్‌తో మీకు మరింత స్వేచ్ఛ
అమెరికా అధ్యక్షుడికి ఇతర ప్రయోజనాలివీ..
- అమెరికా అధ్యక్షుడికి రూ.3.46 కోట్ల వార్షిక వేతనంతో పాటు చాలా రకాల భత్యాలు అందుతాయి.
- వ్యక్తిగత, కార్యాలయ విధుల భత్యం రూ.43 లక్షలు, ప్రయాణ ఖర్చుల భత్యం రూ.86 లక్షలు ఏటా ఇస్తారు.
- కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల భత్యం రూ.16 లక్షలు, వైట్ హౌస్ అలంకరణ ఖర్చులు రూ.86 లక్షలను ఏటా అందిస్తారు.
- ఎయిర్ ఫోర్స్ వన్ విమాన సర్వీసు, మెరైన్ వన్ సర్వీసు, సాయుధ లగ్జరీ కారు అందుబాటులో ఉంటాయి.
- ఉచిత నివాస వసతి ఉంటుంది.
- ప్రభుత్వం తరఫున ఉచిత వైద్య సేవలు పొందొచ్చు.
- అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి వైదొలగే వారికి ఏటా రూ.1.99 కోట్ల పెన్షన్ ఇస్తారు.
- మాజీ అమెరికా ప్రెసిడెంటు కార్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తారు. అందులో పనిచేసే సిబ్బందికి శాలరీలు కూడా సర్కారే ఇస్తుంది.