ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ కాథలిక్కులకు ఆధ్యాత్మిక నేతగా సేవలందించిన పోప్ ఫ్రాన్సిస్(Pope Francis)(88)..ఈరోజు మరణించారు. నిరాడంబర జీవితం గడిపిన ఆయన శ్వాసకోశ సమస్యలు, బ్రోంకైటిస్, డబుల్ న్యుమోనియా వంటి అనారోగ్యాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాప్యంతో వచ్చే అనేక సమస్యలతో కూడా పోరాడిన ఆయన, చివరి వరకు బాధ్యతలతో జీవించారు. పదేళ్లకుపైగా ఆయన కాథలిక్ చర్చికి మార్గదర్శకుడిగా ఉన్నారు.
Chatbot Arena: చాట్‌బాట్ అరేనా అంటే ఏమిటి? ఉపయోగించే విధానం ఎలా?
పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) మరణం అనంతరం ఆయన సంపదపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రపంచంలో అత్యంత ధనిక మత సంస్థ అయిన వాటికన్‌కు నాయకత్వం వహించినా, ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉండేవారు. స్పెయిన్ నేషనల్ డైలీ “మార్కా” ప్రకారం.. పోప్ ఫ్రాన్సిస్ నికర సంపద సుమారు 16 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 136 కోట్లు)గా అంచనా వేయబడింది. ఇది ఇతర పోపులతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఆయనకు అధికారిక నివాసం, ఐదు కార్లు, అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి.
పోప్ పదవికి నెలకు సుమారు $32,000 జీతం నిర్ణయించినా, పోప్ ఫ్రాన్సిస్ అప్పటి నుంచి ఈ మొత్తాన్ని తీసుకోకుండా చర్చికి లేదా సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. పోప్‌గా నియమితులవ్వకముందే ఆయన చర్చి నుంచి డబ్బు తీసుకోకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. వాటికన్‌లో ఆర్థిక పారదర్శకతను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వ్యయ వ్యవహారాలపై నిఘా పెట్టి, సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఆయన మార్గదర్శనం అందించారు.