Ukraine Rebuild Cost..?: ఉక్రెయిన్ ను మళ్ళీ నిర్మించాలంటే ఎంత అవుతుందో తెలుసా!

రష్యా దాడులతో ఉక్రెయిన్ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు మారిపోయింది .. 15 ఏళ్లుగా ఉక్రెయిన్ సాధించిన ఆర్థిక ప్రగతి పూర్తిగా దెబ్బతింది.

Published By: HashtagU Telugu Desk
Do You Know How Much It Will Cost To Rebuild Ukraine..

Do You Know How Much It Will Cost To Rebuild Ukraine..

Ukraine : రష్యా దాడులతో ఉక్రెయిన్ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు మారిపోయింది .. 15 ఏళ్లుగా ఉక్రెయిన్ (Ukraine) సాధించిన ఆర్థిక ప్రగతి పూర్తిగా దెబ్బతింది. దేశ స్థూల ఉత్పత్తి (GDP) 29 శాతం పడిపోయింది. 17 లక్షల మంది ఉక్రెయిన్ వాసులు పేదరికంలోకి వెళ్లినట్టు ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక చెబుతోంది.

ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. రష్యా దాడుల కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుని, ఉక్రెయిన్ పునర్ నిర్మాణం చేసుకోవడానికి వచ్చే దశాబ్ద కాలంలో 411 బిలియన్ డాలర్లు అవసరం. అంటే మన కరెన్సీలో రూ.33.70 లక్షల కోట్లు. యుద్ధ వ్యర్థాలను తొలగించడానికే 5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రపంచబ్యాంకే ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున సాయంతో ఆదుకోనుంది.

ఉక్రెయిన్ లో 9,655 మంది పౌరులు యుద్ధం కారణంగా మరణించారు. ఇందులో 461 మంది చిన్నారులు కూడా ఉన్నారు. 20 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రతి ఐదు ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఒకటి దెబ్బతిన్నది. ఇప్పటి వరకు భవనాలు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం 135 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 2022లో 80 లక్షలకు పైగా ప్రజలు పేదరికంలో మగ్గారు.

పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ఉక్రెయిన్ దళాలు రష్యా దాడులను బలంగా ప్రతిఘటించకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉండేదన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. అసలు పాశ్చాత్య దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ను పావుగా వాడుకోకపోయి ఉంటే.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఎప్పుడో ముగిసిపోయి ఉండేదని, ఇంత నష్టం దాకా వచ్చి ఉండేది కాదని కొందరు నిపుణుల అభిప్రాయం.

Also Read:  Future Cricketer: ఈ బాలిక కాబోయే క్రికెటర్..! వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!

  Last Updated: 24 Mar 2023, 03:35 PM IST