Site icon HashtagU Telugu

Afghanistan: మా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకండి…పాకిస్థాన్ ను హెచ్చరించిన తాలిబాన్..!!

Taliban

Taliban

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ తలదూర్చకూడదంటూ తాలిబాన్లు హెచ్చరించారు. ఈమధ్యే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సెషన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్ రాజకీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానక్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత సమస్యలలో జోక్యం చేసుకోవడం మానేయాలని పాకిస్తాన్‌కు పిలుపునిచ్చినట్లు… టోలో న్యూస్ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ పై ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

‘‘పాకిస్థాన్ ప్రధాని చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇస్లామిక్ ఎమిరేట్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు మేము ఎవరినీ అనుమతించము. పాకిస్థాన్‌కు ఆర్థిక సమస్య ఉంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే, వారికి డబ్బు ఇవ్వమని ఎవరూ పిలవరు. మీకు (పాకిస్థాన్‌) రుణం ఇవ్వకపోతే, అది మీ సమస్య, ఎలాగైనా మీరు ఏదైనా దారి చేసుకోండి, కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గౌరవం గురించి మాట్లాడకండి. డబ్బు సంపాదించడం కోసం ఆఫ్ఘనిస్తాన్ పరువు తీయకండి.‘‘

కాగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని పాక్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ (ఐఎస్ఐఎస్-కె) తెహ్రీక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి), అలాగే అల్-ఖైదా, తూర్పు టర్కిస్తాన్ నుండి పనిచేస్తున్న న తీవ్రవాద గ్రూపులతో అంతర్జాతీయంగా ముప్పు పొంచి ఉందని పాక్ ప్రధాని అన్నారు. షరీఫ్ ప్రకటనతో ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పందించారు. ఆప్ఘానిస్తాన్ ను తీవ్రవాదిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగ్రవాదులు సురక్షిత స్థావరాలు ఏర్పాటు చేసుకుని…దశాబ్దాలుగా ఆఫ్ఘాన్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారని కర్జాయ్ మండిపడ్డారు. అయితే కర్జాయ్ ఆరోపణలు పాక్ కొట్టిపారేసింది. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది.

Exit mobile version