Raping Dead Girls: చనిపోయిన మహిళలను కూడా వదలని నీచ కామాంధులు.. ఏకంగా సమాధులు తవ్వి మరి అత్యాచారాలు?

ఈ సమాజంలో ఆడవాళ్లకు, చిన్నపిల్లలకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది.

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 07:09 PM IST

Raping Dead Girls: ఈ సమాజంలో ఆడవాళ్లకు, చిన్నపిల్లలకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. నిత్యం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని మరి బతుకుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే సమాజం అలా తయారయింది. కామాంధు మృగాలు ఎక్కువై మహిళలను పాడు చేస్తున్నారు. వారిని చంపేస్తున్నారు. అయితే బ్రతికున్నంత కాలమే ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదని తెలుసు. కానీ చచ్చాక కూడా వారికి స్వేచ్ఛ లేదు అని తెలుస్తుంది.

ముఖ్యంగా పాకిస్తాన్ లో ఇటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా సమాధులు తవ్వి మరి అత్యాచారానికి పాల్పడుతున్నారు మృగాళ్లు. దీంతో తమ కూతుర్లు చనిపోయాక కూడా వారి మృతదేహాలు కాపాడుకోలేకపోతున్నారు తల్లితండ్రులు. ఇక కొందరు ఇటువంటివి జరగకూడదు అని వారి సమాధులకు ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసి సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారని చెప్పాలి. అవును ఇటువంటివి చూసి ఇంత ఘోరంగా తయారయ్యామా అని సమాజం చూసి తలదించుకోవాలి.

మృతదేహాలతో కూడా అత్యాచారం చేసే ఘటనలను నెక్రోఫిలియా అని అంటారు. కరాచీలో ఉత్తర నజీమాబాదులో మహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి స్మశానంలో పనిచేసేవాడు. ఇక అతడు 48 మంది మహిళల మృతదేహాల సమాధులు తవ్వి వారిపై అత్యాచారాలు చేశాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక 2011లో అతడు ఆ కేసు పై అరెస్టు అయ్యాడు.

మళ్ళీ ఈ మధ్య కూడా ఇటువంటివి వెలుగులోకి వస్తున్నాయని తెలిసింది. దీంతో తమ కూతుర్లను కోల్పోయిన తల్లిదండ్రులు తమ కూతుర్ల సమాధుల చుట్టూ ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ విషయం పాక్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో సమాధికి గ్రిల్స్ ఏర్పాటు చేసిన ఫోటోను పంచుకొని పాక్ లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతుందని.. ఇప్పుడు మృతదేహాలను కూడా వదిలిపెట్టడం లేదు అంటూ.. కూతుర్లని ఎలాగో పోగొట్టుకున్నారు.. కనీసం మరి గౌరవాన్ని అయినా కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రుల తాపత్రయం.. అందుకే ఇలా గ్రిల్స్ అమర్చుతున్నారు.. ఈ ఫోటో చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలి అని మీడియా కథనం పేర్కొంది