Bangladesh : ఇస్లాంను తప్పుగా అర్థం చేసుకునే దుష్టశక్తులను ఏమాత్రం సహించం: షేక్ హసీనా..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 07:12 AM IST

ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఇస్లాం శాంతియుత వైభవాన్ని కాపాడేందుకు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. ఇస్లాంను దుష్టశక్తులు తప్పుగా అర్థం చేసుకోవడాన్ని వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. మతం సారంశంతో నిండిన సమాజం నుంచి చీకటి, నిరక్షరాస్యత,హింస,ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనందరం శాంతి సందేశాన్ని ఇచ్చే ఇస్లాంను మన గుండెల్లో ఉంచుకుందాం. అంతేతప్పా ఇస్లాంను వ్యతిరేకిస్తూ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నవారిని ఏమాత్రం సహించలేదన్నారు.

బంగాబంధు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో హజ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (HAAB) నిర్వహించిన జాతీయ స్థాయి హజ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. శాంతియుత అహంకారాన్ని కొనసాగించడానికి దేశాన్ని ఉగ్రవాదం నుండి విముక్తి చేయడం, మేము ఉగ్రవాదం పట్ల శూన్య సహనం పాటించాము అని తెలిపారు. జాతిపిత బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ దేశంలో ఇస్లాం కోసం ఎంతో చేశారని, ఆయన వారసుడిగా తమ ప్రభుత్వం ఇస్లాం స్ఫూర్తిని, ప్రజల సంక్షేమాన్ని నిలబెట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోందని షేక్ హసీనా అన్నారు. ఇస్లాం ప్రపంచంలోనే అత్యుత్తమ మతమని, అయితే కొందరు ఉగ్రవాదుల వల్ల కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఉగ్రవాదం, డ్రగ్స్‌లో పిల్లలెవరూ చిక్కుకోకుండా ప్రతి ప్రాంతంలో ఇస్లామిక్ పండితుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.