Aliens Attack: ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉన్నారా ? లేరా ? అనే దానిపై నిత్యం చర్చ జరుగుతుంటుంది. దీనిపై కొత్త అప్‌డేట్ వచ్చింది. సీఐఏ అనేది అమెరికా గూఢచార సంస్థ. ప్రపంచంలో అమెరికాకు పెద్ద శత్రువు రష్యా. అందుకే రష్యాపై సీఐఏ ప్రత్యేక నిఘా పెట్టి ఉంచుతుంది. రష్యాలో ఏం జరిగినా.. సీఐఏ గూఢచారులు వెంటనే ఆ సమాచారాన్ని అమెరికా ఆర్మీకి, ప్రభుత్వానికి చేరవేస్తుంటారు. ఇదే విధంగా రష్యా సైనికులకు(Aliens Attack) సంబంధించిన ఓ సంచలన ఘటన వివరాలను సీఐఏ బయటపెట్టింది. సీఐఏ రూపొందించిన ఆ సీక్రెట్ ఫైల్‌లో ఏముందనే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read :Ram Mohan Naidu : రామ్మోహన్ నాయుడు సహా 9 మందికి ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డులు
వామ్మో.. ఏలియన్స్ ఏం చేశారంటే..
అది 1991 సంవత్సరం. ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న సోవియట్ యూనియన్ (అలనాటి రష్యా) సైనికుల టీమ్ ఒకటి ఫ్లైయింగ్ సాసర్‌ను చూసింది. ఆ బృందంలోని ఒక సైనికుడు, ఆ ఫ్లైయింగ్ సాసర్‌పైకి క్షిపణిని సంధించాడు. దీంతో అది కుప్ప కూలింది. ఆ వెంటనే ఫ్లైయింగ్ సాసర్ లోపలి నుంచి చాలా చిన్నగా ఉన్న ఐదు మానవ రూపాలు (ఏలియన్స్) బయటకు వచ్చాయి. వాటి తలలు, కళ్లు పెద్ద సైజులో ఉన్నాయి. శరీరమంతా నలుపు రంగులో ఉంది. ఫ్లైయింగ్ సాసర్ నుంచి బయటికి రాగానే ఆ ఏలియన్స్ అందరూ కలిసి పోయి ఒకే గోళాకార వస్తువుగా మారిపోయారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆ గోళాకార వస్తువు సైజు అంతకంతకూ పెరుగుతూపోయింది. ప్రకాశవంతమైన వెలుగును విరజిమ్ముతూ అది నింగిలోకి దూసుకుపోయింది. తిరిగి వెళ్లిపోయే క్రమంలో.. ఆగ్రహంతో ఊగిపోయిన ఏలియన్స్ తమ పవర్‌ను ప్రయోగించి, అక్కడున్న దాదాపు 23 మంది సోవియట్ యూనియన్ సైనికులను రాళ్లుగా మార్చారట. రాయిలా మారిన తమ సైనికులను, ధ్వంసమైన UFOను సోవియట్ యూనియన్ రహస్యంగా రాజధాని మాస్కోకు తరలించింది.
ఆ పత్రికల్లో కథనాలు..
ఈ మేరకు వివరాలతో దాదాపు 250 పేజీల సీక్రెట్ డాక్యుమెంట్‌ను సీఐఏ రూపొందించింది. దీన్ని 2000 సంవత్సరంలో డీక్లాసిఫై చేశారని సమాచారం. ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలు, ఆనాటి ఫొటో ఆధారాలు, ఏలియన్స్ ఎటాక్ తర్వాత రష్యా సైనికులు కుప్పకూలిన తీరు వివరాలను సీఐఏ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. ఈవివరాలతో అమెరికాకు చెందిన వీక్లీ వర్ల్డ్ న్యూస్, ఉక్రెయిన్ పత్రిక హోలోస్ ఉక్రెయినీ కథనాలను ప్రచురించాయి. 1989-1990 సంవత్సరాల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని వీక్లీ వర్ల్డ్ న్యూస్ అంచనా వేసింది.ఈ వివరాలను ‘ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్’ పాడ్‌కాస్ట్‌లో కూడా ప్రస్తావించారు.