Site icon HashtagU Telugu

Qatar: 8 మంది భారతీయులకు ఊరట.. మరణశిక్ష రద్దు

Qatar

Qatar

Qatar: ఖతార్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్‌లోని దిగువ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ శిక్షను రద్దు చేసింది.

ఖతార్‌లోని అధికారులు 2022 ఆగస్టు 30న అరెస్టు అయ్యారు. కేసు విచారణ ఈ ఏడాది మార్చి 29న ప్రారంభమైంది. గూఢచర్యం ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ నౌకాదళ అధికారులకు ఖతార్ కోర్టు అక్టోబర్ 26న మరణశిక్ష విధించింది. భారతదేశం దీనిని తీవ్రంగా పరిగణించింది. అధికారులను రక్షించడానికి చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. ఈ విజ్ఞప్తి సానుకూల ప్రభావం చూపుతుందని భారత్ కూడా ఆశాభావం వ్యక్తం చేసింది.

ఉద్యోగుల పేర్లు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట, కమాండర్ పురేనేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్‌పాల్ మరియు సెయిలర్ రాగేష్. వీళ్లంతా అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే డిఫెన్స్ సర్వీసెస్ కంపెనీలో పనిచేస్తున్నారు.

Also Read: Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!