SUPARCO: ఇండియా నుంచి విడిపోయాక పాకిస్థాన్ తనను తాను సూపర్ పవర్‌గా మార్చాలని భావించింది.తమ బలాన్ని స్పేస్ లో చూపించాలని అనుకుంది. అందుకు అంతరిక్ష సంస్థను స్థాపించింది. భారత్ కంటే ముందుగానే పాక్ రాకెట్లను ప్రయోగించడం మొదలు పెట్టింది. ఈ విషయంలో పాకిస్తాన్ చైనా సహాయం తీసుకుంది. ఒక సమయంలో అమెరికా సహాయం కోరింది. కానీ తరువాత దేశంలో ఎన్నో పరిణామాలు విచ్చిన్నం చేశాయి. అస్థిర ప్రభుత్వాలు మరియు సైన్యం తిరుగుబాటు ప్రతిదీ పాక్ ని బలహీనం చేశాయి. సైనిక శక్తిని పెంచడానికి మరియు క్షిపణులను ప్రయోగించడం కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేసింది. దీంతో దేశం ఆర్ధికంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం భారత అంతరిక్ష సంస్థ నిధులు పాకిస్థాన్‌తో పోలిస్తే 70 రెట్లు ఎక్కువ.
SUPARCO రహస్యాన్ని బట్టబయలు చేసింది పాక్ మీడియా:
పాక్ మీడియా స్వయంగా తమ అంతరిక్ష సంస్థ SUPARCO పోల్ స్ట్రిప్‌ను బహిర్గతం చేసింది. SUPARCO ఎందుకు విఫలమవుతుందో వివరించారు. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ప్రకారం… పాకిస్తాన్ అంతరిక్ష సంస్థ వెనుకబాటుకు ప్రధాన కారణం రిటైర్డ్ సైనిక అధికారికి ఆదేశాన్ని ఇవ్వడమేనని తెలిపింది. సుపర్కో (SUPARCO) కమాండ్ నిపుణుడికి ఇస్తే పరిస్థితి మెరుగుపడుతుందని డాన్ నివేదిక చెబుతోంది.
Also Read: Telangana BJP : నిజంగానే వీరంతా బిజెపిని వీడితే పరిస్థితి ఏంటి..?