US Cyclone : అమెరికాలో ఒఫెలియా తుఫాను తీవ్రత మరింత పెరిగింది. దీని ప్రభావంతో నార్త్ కరోలినాలోని ఎమరాల్డ్ ఐలాండ్ సమీపంలో భారీగా వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల 10 అంగుళాల (25 సెం.మీ.) మేరకు వర్షం కురిసింది. గంటకు 50 మైళ్ల (80 కి.మీ) వేగంతో గాలులు వీచాయని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. దీంతో వాషింగ్టన్, నార్త్ కరోలినాలలో వరదలు సంభవించాయి. పామ్లికో నది ఒడ్డున ఉన్న నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి కూడా చేరాయి. వీధుల్లో పార్క్ చేసిన వాహనాలు కూడా పాక్షికంగా వరద నీటిలో మునిగాయి.
Also read : SP Balasubrahmanyam : అవకాశాలను శోధించి, సాధించిన ఘనుడు.. గాన గంధర్వుడు బాలు
మరోవైపు వర్జీనియాలో స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఒక ప్రకటన చేసింది. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించింది. ఆదివారం మధ్యాహ్నం నాటికి, ఉత్తర కరోలినా, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీలలో 65,000 కంటే ఎక్కువ ఇళ్లు, వ్యాపార సముదాయాలు చీకటిలోకి (US Cyclone) జారుకున్నాయి.