Site icon HashtagU Telugu

Curfew Imposed In Nepal: నేపాల్‌లో నిర‌వ‌ధిక క‌ర్ఫ్యూ.. కార‌ణ‌మిదే..?

Curfew Imposed In Nepal

Safeimagekit Resized Img (1) 11zon

Curfew Imposed In Nepal: భారత్‌కు ఆనుకుని ఉన్న నేపాల్‌ (Curfew Imposed In Nepal)లోని బిర్‌గంజ్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీని తరువాత పరిస్థితిని నియంత్రించడానికి నేపాల్ పరిపాలన సోమవారం (ఫిబ్రవరి 19) నుండి నిరవధిక కర్ఫ్యూ విధించింది. సరస్వతీమాత విగ్రహం నిమజ్జనంపై ఈ దుమారం రేగింది.

వార్తా సంస్థ PTI ప్రకారం.. పర్సా జిల్లా ముఖ్య జిల్లా అధికారి దినేష్ సాగర్ భూషాల్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. 4 రోజుల క్రితం రౌతహత్ జిల్లాలో హిందూ సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు సరస్వతి విగ్రహాన్ని పూజించడం ప్రారంభించినప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పూజ త‌ర్వాత‌ నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.

పరిస్థితి అదుపులోనే ఉందని, దీంతో రెండో రోజైన మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్లు సీడీఓ దినేష్ సాగర్ భూషాల్ తెలిపారు. అల్లర్లు సృష్టించారనే ఆరోపణలపై ఇరువర్గాలకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలు క్షీణించడంతో కొంత మంది అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ యువకులు

మీడియా నివేదికల ప్రకారం.. భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి నేపాల్ ప్రభుత్వం 1000 మంది పోలీసులు, ఆర్మీ సిబ్బందిని మోహరించింది. పరిస్థితి చక్కబడే వరకు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. పర్బానీపూర్ పర్సా, నగ్వా చౌక్, తిలాబే బ్రిడ్జ్, మైత్రి పుల్‌లలో కర్ఫ్యూ విధించబడింది. మొత్తం ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. అయితే పరిస్థితిని నియంత్రించడానికి భద్రతా సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

నగరంలో కర్ఫ్యూ విధించినప్పటి నుండి ఎవరైనా గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం, ర్యాలీలు చేయడం, రోడ్లపై నడవడం మొదలైన వాటిపై నిషేధం విధించినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. సాయుధ పోలీసు సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. గుర్తించిన కూడళ్ల వద్ద ఆధునిక ఆయుధాలతో కూడిన సైనికులను మోహరించారు. మరోవైపు కర్ఫ్యూ కొనసాగిన తర్వాత కూడా మంగళవారం (ఫిబ్రవరి 20) హిందూ సంస్థలు ఈ సంఘటనను నిరసిస్తూ ఘడియర్వా పోఖ్రీ, రాణిఘాట్, గహ్వా మొదలైన వివిధ ప్రాంతాలలో టైర్లను తగులబెట్టి, వికృత శక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join