Crying Record: అన్ని గంటలసేపు ఏడ్చి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి.. ఎక్కడో తెలుసా?

మామూలుగా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు, అలా సందర్భాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం. మామూలుగా ఏడవడం అంటే కొద్ది గంటలే అన

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 05:23 PM IST

మామూలుగా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు, అలా సందర్భాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం. మామూలుగా ఏడవడం అంటే కొద్ది గంటలే అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని సార్లు గంటల నుంచి ఏడవడం అన్నది కూడా పెద్ద టాస్కే. లోలోపల బాధ ఉన్నా కూడా చాలామంది కన్నీటిని దాచుకుంటూ ఉంటారు. కానీ ఏడ్చి కూడా రికార్డ్ నెలకొల్పవచ్చు ఒక వ్యక్తి నిరూపించాడు. ఏడుపు మీద ప్రపంచ రికార్డు ఏంటనీ అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. సాధారణంగా మనిషి సంతోషం వస్తే నవుతారు. బాధలు వస్తే ఏడుస్తున్నారు. ఇంకా తీరని బాధలు ఉంటే కుమిలి కుమిలి ఏడుస్తుంటారు.

ఏడుపు అనకుంటే వచ్చేది కాదు. దానంత అది రాదు. కానీ ఒక వ్యక్తి కావాలని ఏడుస్తూ ప్రపంచ రికార్డు సాధించాలని భావించి చివరికి అనుకున్నది సాధించాడు. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు ఏడవనంత సేపు ఏడ్చి గిన్నీస్‌ వరల్డ్ రికార్డు సాధించాడు. కానీ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇంతకీ అతను ఎవరు అది ఎలా సాధ్యమైంది అన్న విషయానికి వస్తే.. నైజీరియాకి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవడం అనే ఫీట్‌ని ఎంచుకున్నాడు. రికార్డు బ్రేక్‌ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఏడ్చాడు.

దీంతో అతడు 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అతను అంతలా కంటిన్యూగా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనారోగ్య సమస్య రావడంతో తాను తన ఏడుపును కొనసాగించలేక పోతున్నట్టు ప్రకటించాడు. ఎబెరే గిన్నీస్‌ వరల్డ్ రికార్డుకి దరఖాస్తు చేయకపోవడంతో దానిని గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ వారు అతను ఏడ్చిన సమయాన్ని లెక్కలోకి తీసుకోలేదు. వరల్డ్ ​ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. కొద్ది నెలల క్రితం ఒక నైజీరియన్‌ మహిళ 100 గంటల పాలు కంటిన్యూగా వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మేలో హిల్డా బాసి అనే చెఫ్ నైజీరియన్ వంటకాలకు పేరు తేవడానికి 100 గంటలపాటు నిరంతరం వంట చేసి గిన్నీస్‌ వరల్డ్ రికార్డును సాధించింది.