Site icon HashtagU Telugu

China : చైనాలో మారుమోగుతున్న బప్పిలహరి పాట..ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన..!!

china

china

డిస్కో డ్యాన్సర్ సినిమాలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. బప్పిలహరి స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు చైనాలో మారుమోగుతోంది. కోవిడ్ వల్ల లాక్ డౌన్ పాటిస్తున్న ఈ దేశ ప్రభుత్వ తీరును ఖండిస్తూ…చైనీయులు ఇలా వెరైటీగా నిరసనలు చేపడతున్నారు. ఈ నిరసనల్లో భాగంగా జిమ్మీ జమ్మీ పాట మారుమోగుతోంది. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చైనీయులు. ఆ నిరసనల్లోనే ఈ పాట చైనా వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది.

https://twitter.com/ananthkrishnan/status/1587337932142247936?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1587337932142247936%7Ctwgr%5Ed29df24aa8472c52be2861266dc782a2878badd5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F

చైనాలో టిక్ టాక్ కు బదులుగా డౌయిన్ అనే యాప్ చాలా ఫేమస్. ఆ యాప్ లో ఈ పాటతో నిరసనలు తెలుపుతూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. చైనాలో సోషల్ మీడియాపై విపరీతమైన ఆంక్షలు ఉన్నప్పటికీ…వైరల్ గా మారుతున్న ఈ పాటను మాత్రం ఏమాత్రం కట్టడి చేయలేక చేయిలెత్తేసింది చైనా.