COVID-19: సింగపూర్‌లో విజృంభిస్తున్న కోవిడ్

సింగపూర్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం నమోదైన కొత్త కేసులతో పోలిస్తే ఈ వారం డిసెంబర్ 3 నుండి 9 వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

COVID-19: సింగపూర్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం నమోదైన కొత్త కేసులతో పోలిస్తే ఈ వారం డిసెంబర్ 3 నుండి 9 వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత వారం 32,035 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఈ వారంలోనే 56,043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో సింగపూర్ ఆరోగ్య శాఖ వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చే యాత్రికులకు ఓ సలహా జారీ చేసింది. కోవిడ్ -19 కేసులు మళ్లీ పెరుగుతున్నందున పర్యాటకులు మరియు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని ఆదేశించారు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఇంట్లోనే ఉండాలని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను పరామర్శించేటప్పుడు మాస్క్ ధరించాలని సూచించింది.

సింగపూర్ ప్రభుత్వం విమాన ప్రయాణికులు విమానాశ్రయాల్లో మాస్క్‌లు ధరించాలని మరియు ప్రయాణ సమయంలో ఆరోగ్య బీమా తీసుకోవాలని కోరింది. గత వారంతో పోలిస్తే దేశంలో కొత్త కేసులు 75 శాతం పెరిగాయని తెలిపింది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరియు వృద్ధులు ఫ్లూ వ్యాక్సిన్లు మరియు కోవిడ్ బూస్టర్ మోతాదులను తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Also Read: Nagababu : వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ మంత్రులేనట..నాగబాబు హాట్ కామెంట్స్