WHO Alert : ‘కొవిడ్-19’ కథ ముగిసిందని మీరు భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీనికి సంబంధించి మరో అలర్ట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO Alert) తాజాగా జారీ చేసింది. 84 దేశాలలో గత కొన్ని వారాల వ్యవధిలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. వివిధ రకాల కరోనా వైరస్ వేరియంట్లు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నాయని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
మొత్తం మీద ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కొవిడ్-19 టెస్ట్ పాజిటివిటీ రేటు 10 శాతానికిపైనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అంటోంది. అయితే ఇది 84 ప్రభావిత దేశాల్లో ఒక్కో చోట ఒక్కో స్థాయిలో ఉందని తెలిపింది. ప్రత్యేకించి ఐరోపా దేశాల్లో కరోనా పాజిటివిటీ రేటు 20 శాతానికిపై ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
Also Read :Startup Registration : స్టార్టప్‌ను రిజిస్టర్ చేసుకోవాలా ? ఆన్‌లైన్‌లో చాలా ఈజీ ప్రాసెస్
చాపకింద నీరులా కరోనా..
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జులైలో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
- ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో దాదాపు 40 మంది అథ్లెట్లు కొవిడ్-19 బారినపడ్డారు. కొందరు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
- అమెరికా, ఐరోపా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలలో కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి.
Also Read :Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆపండి.. ఐక్యరాజ్యసమితి పిలుపు
కరోనా బారిన పడినవారిలో కొందరికి ఇప్పటికీ పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాంటి వారికోసం రెమిడియమ్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ కలిసి ‘కోరోక్విల్-జెన్’ అనే మందును తయారు చేశాయి. దీనికి భారత ఆయుష్ శాఖ అనుమతులు ఇచ్చింది. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్న జింక్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ మిశ్రమం ఇందులో ఉన్నాయి.