Yunus Vs Army : త్వరలోనే బంగ్లాదేశ్‌లో సైనిక పాలన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌తో విభేదాలు రావడంతో తిరుగుబాటు చేయాలని ఆర్మీ చీఫ్ వకారుజ్జమా సారథ్యంలోని బంగ్లాదేశ్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వకారుజ్జమా సారథ్యంలో సోమవారం రోజు ఆర్మీ ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. తదుపరిగా ఏం చేయాలి ? మహ్మద్ యూనుస్ ప్రభుత్వంపై ఎలాంటి వైఖరిని తీసుకోవాలి ? అనే దానిపై వారు చర్చించారు. ఈ ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్ (జీఓసీలు), స్వతంత్ర బ్రిగేడ్‌ల కమాండింగ్ ఆఫీసర్లు, ఆర్మీ హెడ్ క్వార్టర్ల ప్రధాన అధికారులు పాల్గొన్నారు.
Also Read :Rare Temples : ఏడాదిలో ఒక్కరోజే తెరుచుకునే ఆలయాలు ఇవే
తదుపరి ప్రణాళికలు ఇవీ..
బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించాలని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌పై(Yunus Vs Army) ఆర్మీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఎమర్జెన్సీని ప్రకటించగానే సైనిక పాలనను బంగ్లాదేశ్ ఆర్మీ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. తదుపరిగా తమ సారథ్యంలో దేశంలో ‘జాతీయ ఐక్యతా ప్రభుత్వం’ను ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ఆర్మీ భావిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఆర్మీ సూచించే వారికే అవకాశాలు దక్కుతాయి. తద్వారా దేశంలోని అన్ని విభాగాలపై ఆర్మీకి పట్టు దక్కుతుంది.
Also Read :Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు
ఆర్మీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు
అయితే ఆర్మీ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా చేసేందుకే ఆర్మీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది.బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు జరగొచ్చనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సంక్షోభ వాతావరణం నుంచి గట్టెక్కేందుకు చైనా నుంచి దౌత్యపరమైన సాయాన్ని యూనుస్ అడుగుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై చైనా ఎలా స్పందిస్తుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.