Trump Disqualified : అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ అనర్హుడు : కొలరాడో సుప్రీంకోర్టు

Trump Disqualified : అమెరికాలోని కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

  • Written By:
  • Updated On - December 20, 2023 / 08:58 AM IST

Trump Disqualified : అమెరికాలోని కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2024 అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ అనర్హుడని ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 5న కొలరాడో రాష్ట్రంలో జరగనున్న రిపబ్లికన్ ప్రైమరీకి ఈ తీర్పు వర్తిస్తుందని, అందులో దేశ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ నిలబడటానికి వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. అమెరికా రాజ్యాంగం 14వ సవరణలోని సెక్షన్ 3 ప్రకారం దేశ అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ట్రంప్ అనర్హుడని వెల్లడించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ప్రైమరీ బ్యాలెట్ల ముద్రింపు గడువు జనవరి 5 వరకు ఉంది. ఈనేపథ్యంలో తమ తీర్పుపై జనవరి 4 వరకు లేదా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు కొలరాడో సుప్రీంకోర్టు స్టే విధించింది.

We’re now on WhatsApp. Click to Join.

2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌పై దాడికి అనుచరులను ట్రంప్ ప్రేరేపించడాన్ని తిరుగుబాటుగా  అభివర్ణించిన కొలరాడో సుప్రీంకోర్టు.. ఆయనకు మరోసారి దేశ అధ్యక్ష పదవిని చేపట్టే అర్హత లేదని వ్యాఖ్యానించింది. దీంతో ఈవిధమైన ఆరోపణలతో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అనర్హత వేటును ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా ట్రంప్ నిలిచారు.ఈ తీర్పు వచ్చే ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా సాధారణ ఎన్నికలలో పోటీ చేసేందుకు ట్రంప్‌కు  ఉన్న అవకాశాలను తగ్గించిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Also Read: Nawaz Sharif : పాక్ సైన్యం, జడ్జీలపై నిప్పులు చెరిగిన నవాజ్

అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు ప్రకటించారు. 2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ వద్ద జరిగిన అల్లర్లను ‘తిరుగుబాటు కుట్ర’ అభియోగంగా ట్రంప్‌పై మోపడం సరికాదన్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచార టీమ్ దీనిపై స్పందిస్తూ.. ‘‘కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు లోపభూయిష్టంగా ఉంది. దీనిపై మేం సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తాం. ఈ అప్రజాస్వామిక నిర్ణయంపై స్టే కోసం పిటిషన్ దాఖలు చేస్తాం’’ అని(Trump Disqualified) వెల్లడించింది.