600 Massacred : అత్యంత దారుణం.. అమానుషం !! ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలోని బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు రక్తక్రీడ ఆడారు. ఆ ఉగ్రమూకలు రాక్షసంగా ప్రవర్తించి 600 మందికిపైగా సామాన్య ప్రజలను తుపాకులతో కాల్చి చంపారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఉదంతం జరిగిపోయింది. అయితే ఆ తర్వాత సైన్యం నిర్వహించిన సహాయక చర్యల్లో మృతదేహాలను సేకరించేందుకు మూడు రోజుల టైం పట్టింది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమీన్ ఉగ్రసంస్థల మిలిటెంట్లు ఆగస్టు 24న ఈ దుశ్చర్యకు(600 Massacred) పాల్పడ్డారు. ఈ ఉగ్రకాండ వివరాలు అత్యంత ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
Also Read :Kumari Selja : నాకు స్వాగతం పలకడానికి బీజేపీ రెడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
బుర్కినాఫాసోలోని బర్సాలోగో పట్టణంపై ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడేవారు. దీంతో ఉగ్రవాదుల వాహనాలు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పట్టణం చుట్టూ లోతైన గుంతలను తవ్వుకోవాలని దేశ మిలిటరీ ప్రజలకు సూచించింది. దీంతో ప్రజలంతా కలిసి పట్టణం చుట్టూ గుంతలను తవ్వడం మొదలుపెట్టారు. ఈవిషయం తెలియడంతో ఉగ్రవాదులు బర్సాలోగో పట్టణంలోకి పెద్దసంఖ్యలో బైక్‌లపై వచ్చారు. గుంతలను తవ్వుతున్న దాదాపు 600 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. మహిళలు, పిల్లలు అని చూడకుండా అక్కడున్న పట్టణవాసులు అందరి ప్రాణాలు తీశారు. కొందరు భయంతో పరుగులు తీస్తుంటే.. వారిపైనా ఫైరింగ్ చేసి కడతేర్చారు.
Also Read :Zakir Naik : అనాథ శరణాలయంలో కార్యక్రమం.. స్టేజీ నుంచి దిగిపోయిన జాకిర్ నాయక్
ఈ పాశవిక దాడిని ఖండిస్తూ బుర్కినా ఫాసో వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను సైన్యం ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. బుర్కినాఫాసో దేశంలో రెండుసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది. ఎట్టకేలకు 2022లో ఈ దేశం పాలనా పగ్గాలు ఆర్మీ చేతుల్లోకి వచ్చాయి. సైన్యం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గతంలో మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపణతో రెండు గ్రామాలకు చెందిన వందలాది మందిని ఏకంగా సైన్యమే కాల్చి చంపింది. అంటే బుర్కినాఫాసోలో న్యాయవ్యవస్థ కూడా నిర్వీర్యం అయింది. సైన్యమే అన్నీ తానై నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటోంది.