Site icon HashtagU Telugu

South Africa : కాక్‌పిట్‌లో కోబ్రా, విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్.

Cobra

Cobra

విమానంలోని కాక్ పిట్లో (cockpit)కోబ్రా (cobra)కనిపించడంతో పైలెట్ అప్రమత్తమయ్యాడు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫైలట్ అప్రమత్తతో విమానాన్ని ల్యాండింగ్ చేసినందుకు ప్రయాణీకులతోపాటు, అధికారులు ఆయన్ను ప్రశంసించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికా ఫ్లైట్ లో చోటుచేసుకుంది. పైలట్ రుడాల్ఫ్ ఎర్మాస్మస్ చాకచక్యంతో వ్యవహారించడంతో పెను ప్రమాదం తప్పింది. కాక్ పీట్లో పామును గుర్తించానని తెలిపాడు. నెమ్మదిగా తన సీటుకు వస్తున్న పామును గుర్తించి ఒక క్షణం మౌనంగా ఉండిపోయానని… ప్రయాణీకులకు చెబితే భయాందోళనకు గురవుతారని…వెల్కామ్ లోని ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు.